Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ప్రభుత్వం పై బండి సంజయ్ , ఈటల ధ్వజం…

 

కేసీఆర్ ప్రభుత్వం పై బండి సంజయ్ , ఈటల ధ్వజం
-హుజురాబాద్ పర్యటనలో ఇరువురి నేతల పర్యటన

కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం … బండి సంజయ్

-అవినీతి మంత్రుల చిట్టా రెడీ …వారి భరతం పడతామని వార్నింగ్
-సీఎం కేసీఆర్‌ను జైలుకు వెళ్లడం ఖాయం
-ఈటల రాజేందర్ జోలికి వ‌స్తే కేసీఆర్ గడీలు బద్దలు కొడుతమని హెచ్చరిక
-గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే మా లక్ష్యం
-ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం స‌రికాదు

ఈటల

-హుజూరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరటం ఖాయం
-రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవడం తథ్యం
-సొంత‌ పార్టీ నేత‌ల‌ను కొనుగోలు చేసే స్థితికి టీఆర్ఎస్ చేరుకుంది
-సీఎం కేసీఆర్ కేవ‌లం డబ్బు, అధికారాన్ని నమ్ముకున్నారు
-ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జ‌రిగితే టీఆర్ఎస్ కు డిపాజిట్ ద‌క్క‌దు

 

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో కలిసి బండి సంజ‌య్‌ మీడియాతో మాట్లాడుతూ.. అనేక అవినీతి ఆరోపణలు కారణమౌతున్న సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని అన్నారు .

ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టా తీశామని ఆయ‌న చెప్పారు. ఇందులో అనేకమంది తేలుకుట్టిన దొంగలు ఉన్నారని అన్నారు . ఈటల రాజేందర్ జోలికి వ‌స్తే కేసీఆర్ గడీలు బద్దలు కొడుతామని హెచ్చరించారు. ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపేనని, గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సర్పంచ్‌కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారంటే దానికి కార‌ణంగా ఈటల బీజేపీలో చేరడమేన‌ని ఆయ‌న అన్నారు. నిరంకుశంగా వ్యవహరించే కేసీఆర్ ఈటల దెబ్బకు మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడటం ప్రారంభించారని అన్నారు .

సీఎం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలవలేరని అన్నారు. జైళ్ల‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, జైలు అంటే ఆయ‌న‌కు భయమ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం స‌రికాద‌ని, పేద‌ల‌కు డబుల్ బెడ్‌రూమ్‌లకు, దళితులకు మూడు ఎక‌రాలు ఇవ్వ‌డానికి దొరకని భూములు అమ్ముకోవడానికి మాత్రం ఎలా దొరుకుతున్నాయ‌ని ఆయ‌న నిల‌దీశారు.

కేసీఆర్ఈ డబ్బు ,అధికారాన్ని నమ్ముకున్నారు ఈటల రాజేందర్

తెలంగాణ స‌ర్కారుపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హుజూరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ కేవ‌లం డబ్బు, అధికారాన్ని నమ్ముకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని విమర్శించారు.

హుజూరాబాద్‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ ప్రజాస్వామ్యబద్ధంగా కొన‌సాగితే టీఆర్ఎస్ అభ్య‌ర్థికి డిపాజిట్‌ కూడా ద‌క్క‌ద‌ని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధిష్ఠానం చివ‌ర‌కు వారి సొంత‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే స్థితికి చేరుకుంద‌ని అన్నారు. కేసీఆర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిన‌ప్ప‌టికీ రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారు.

రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను యాచకులుగా మార్చే పాలన కొన‌సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీయే గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవమూ ప్ర‌ధాన‌మేన‌ని చెప్పారు.

 

Related posts

రాష్ట్రానికి మేలు చేసే పార్టీకే మా మద్దతు : వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి!

Drukpadam

రాహుల్‌గాంధీ ఏమనుకుంటున్నారు.. మనోళ్లపైనా సాయుధ బలగాలను ప్రయోగించమంటారా?: బీజేపీ సూటి ప్రశ్న

Ram Narayana

షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ!

Drukpadam

Leave a Comment