Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీల‌క ప‌రిణామం… కేటీఆర్ అరెస్టుపై కోర్టు కీల‌క ఆదేశాలు!

  • కేటీఆర్ క్వాష్ పిటిష‌న్ పై ఇవాళ మ‌రోసారి విచార‌ణ‌
  • ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు
  • కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మరో రోజు పాటు పొడిగించింది. ఫార్మూలా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది. 

ఈ నెల 21న కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై డిసెంబ‌రు 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఇంత‌కుముందు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విచార‌ణ‌ను ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ 

ఈ కేసులో హైకోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంతో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.

Related posts

తగిన సమయంలో నిర్ణయం తీసుకోండి …ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు… హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట!

Ram Narayana

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. బడా బాబులకు చురక…

Ram Narayana

Leave a Comment