Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

బంగారం ధరలు పైపైకి…!

  • క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు
  • ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,850
  • 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,800

దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగుమతి దారులు, బ్యాంకర్ల నుంచి పెరిగిన గిరాకీతో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం, జ్యువైలర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి బంగారం, వెండి ధరలు పెరిగాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350లు పుంజుకుని రూ.79,200లకు చేరుకుంది. గురువారం తులం బంగారం ధర రూ.78,850ల వద్ద స్థిరపడింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ.350లు పెరిగి రూ.78,800 పలికింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.900 వృద్ధి చెంది రూ.91,700లకు చేరుకుంది. 

కామెక్స్ గోల్డ్ వ్యూచర్స్‌లో ఔన్స్ గోల్డ్ ధర 13.70 డాలర్లు పడిపోయి 2,640.20 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ వ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.74 శాతం పతనంతో 30.17 డాలర్లకు చేరుకుంది. 

Related posts

క్విక్ కామర్స్‌లోకి అమెజాన్.. ఇక 15 నిమిషాల్లోనే డెలివరీ!

Ram Narayana

కొనసాగుతున్న పసిడి పరుగు.. రూ. 85 వేలు దాటేసిన పుత్తడి ధర…

Ram Narayana

అనిల్ అంబానీపై సెబీ వేటు.. ఐదేళ్ల‌ నిషేధంతో పాటు రూ.25 కోట్ల జరిమానా!

Ram Narayana

Leave a Comment