Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

102 యేండ్ల క్రితం స్పానిష్ ఫ్లూమూడో ద‌శ‌లో విజృంభించింది: ఎయిమ్స్ న్యూరాలజీ హెడ్ ప‌ద్మ‌…

102 యేండ్ల క్రితం స్పానిష్ ఫ్లూమూడో ద‌శ‌లో విజృంభించింది -ఎయిమ్స్ న్యూరాలజీ హెడ్ ప‌ద్మ‌
-దేశంలో మూడోద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌కుండా ఉంటుంది
-ప్ర‌తి నిపుణుడూ అంచ‌నా వేస్తున్నారు
-ఇప్ప‌టికే మ‌నం రెండోద‌శ క‌రోనా విజృంభ‌ణ‌ను ఎదుర్కొంటున్నాం
-మూడో ద‌శ విజృంభ‌ణ‌కు త‌లుపులు తెరుస్తున్నాం

దేశంలో క‌రోనా మూడోద‌శ ముప్పు ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాల‌న్నీ లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డం ప‌ట్ల ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్యులు అభ్యంత‌రాలు తెలుపుతున్నారు. మూడవదశపై అప్రమత్తంగా లేకపోతె తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎయిమ్స్ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎంవీ ప‌ద్మ శ్రీవాస్తవ హెచ్చరించారు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ విష‌యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో మూడోద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క నిపుణుడూ అంచ‌నా వేస్తున్నార‌ని ఆమె గుర్తు చేశారు. క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మానకూడ‌ద‌ని వారు చెబుతున్నార‌ని, లేదంటే మూడో ద‌శ ముప్పు త‌ప్ప‌ద‌ని అంటున్నార‌ని ఆమె తెలిపారు.

వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ కూడా మూడో ద‌శ‌లోనూ విజృంభించింద‌ని, చ‌రిత్ర పున‌రావృతం అవుతుంద‌ని అన్నారు. వైర‌స్‌కు సంబంధించి ఎన్నో వేరియంట్లు పుట్టుకురావ‌డంతో పాటు ప‌లు అంశాలు దీనికి కార‌ణాలుగా చెప్పవ‌చ్చ‌న్నారు.

‘ఇప్ప‌టికే మ‌నం రెండోద‌శ క‌రోనా విజృంభ‌ణ‌ను ఎదుర్కొంటున్నాం. అంతేగాక‌, మూడో ద‌శ విజృంభ‌ణ‌కు త‌లుపులు తెరుస్తున్నాం. అందుకే క‌రోనా మ‌రోసారి విజృంభించ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, మ‌న తీరు మారాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనాను అదుపు చేయ‌డం అనేది కేవ‌లం ప్ర‌భుత్వ‌, వైద్య వ్య‌వ‌స్థ బాధ్య‌త కాదు. ఇది నా బాధ్య‌త‌.. స‌మాజంలోని ప్రతి భార‌తీయుడి బాధ్య‌త‌’ అని ప‌ద్మ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన వేళ తగిన విధంగా చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని పాలకులాలు కూడా తగిన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

కరోనా వల్ల 37 లక్షల మంది మరణించారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అనధికార లెక్కల ప్రకారం ఇంతకు మూడు రేట్లు అధికంగా ఉంటుందని అంటున్నారు . సుమారు 18 కోట్ల మందు కరోనా భారిన పడ్డారు . ఇందులో అమెరికా , భారత్ , బ్రెజిల్ దేశాలలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది.

సరిగ్గా 102 సంవత్సరాల క్రితం 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల 2 కోట్ల మంది చనిపోయారు . ఒక్క అమెరికా లోనే 6 లక్షల 75 వేలమంది వ్యాధి సోకింది , 70 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . అప్పుడు ప్రపంచ జనాభాలో 1 /3 వంతు మంది స్పానిష్ ఫ్లూ భారిన పడ్డారు . అప్పట్లో మందులు సరిగా లేవు . వ్యాక్సిన్ అభివృద్ధి కాలేదు .శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి జరగలేదు .ప్రపంచంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి కాలేదు . అప్పట్లోనే స్కూల్స్ , వర్తక ,వాణిజ్య సముదాయాలు మూసి వేశారు. స్పానిష్ ఫ్లూ అనేది ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టతలేదు . మొదటి ప్రపంచయుద్ధంలో న్యూట్రల్ గా ఉన్న స్పానిష్ దేశం నుంచి ఈ వార్తలు వచ్చినందున స్పానిష ఫ్లూ అని పేరు పెట్టారు .యుద్ధం లో పాల్గొన్న సైనికులు వివిధ దేశాల క్యాంపు లలో ఉన్నందున బహుశా అది ప్రపంచానికి వ్యాపించి ఉంటుందని అనుకున్నారు .

స్పానిష్ తరువాత , 1957 -58 లోను తరువాత 2009 -10 లలో మరిరకమైన ఫ్లూ లు వచ్చాయి. ఎబోలా అనేది కూడా ఆఫ్రికా దేశాలలో వచ్చింది. ఇప్పుడు కరోనా అనేది ప్రపంచ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళి కి మూడవ వెవ్ ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికల నడుమ కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశాయి. నిపుణల హెచ్చరికలను పాటించకపోతే తగిన మూల్యం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు….

Drukpadam

అసమానతల ప్రపంచం వల్లే కొత్త వేరియంట్లు: ఐక్యరాజ్యసమితి!

Drukpadam

కొవిడ్ ఒక్కటే కాదు.. ఇతర ఇన్ఫెక్షన్లూ వేధిస్తాయి జాగ్రత్త: డబ్ల్యూహెచ్ఓ…

Drukpadam

Leave a Comment