ఐదు కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనను చూసేందుకు కొండపై భక్తులు ఎగబడ్డారు. ఐదు కేజీల బంగారు నగలతో శ్రీవారి చెంతకు వచ్చిన ఆయన మరెవరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్‌కుమార్. స్వామివారి భక్తుడైన విజయ్‌కుమార్ తరచూ తిరుమల సందర్శిస్తుంటారు. బంగారంపై మక్కువతో ఆభరణాలు చేయించుకుని ధరిస్తానని విజయ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

previous post