Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

యుటిఎఫ్ స్వర్ణోత్సవ పతాక జాతాలకు ఖమ్మంలో ఘన స్వాగతం

యుటిఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. యుటియఫ్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు ఈనెల 5 నుండి 8 వరకు కాకినాడలో జరుగుతున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో రెండవ మహాసభ ఖమ్మంలో, తొమ్మిదవ మహాసభ హైదరాబాద్ లో, పదకొండవ మహాసభ నల్గొండ నందు జరిగాయని ఈ మూడు మహాసభల పతాకాలను జాతాలో కాకినాడ తీసుకెళ్తున్నామని టియస్ యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ.రవి, ఎ.వెంకట్ తెలియజేశారు. శనివారం స్థానిక మంచి కంటి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ప్రెస్ మీట్ ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అధ్యయనం ,అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా యుటిఎఫ్ పయనిస్తున్నదని, ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని, అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని, విద్యా కమిషన్ ద్వారా విద్యా రంగంలో అవసరమైన మార్పులు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి.నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరొకసారి గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

జాతాకు ఘన స్వాగతం పలికిన యుటియఫ్ శ్రేణులు

హైదరాబాద్, నల్గొండ జాతాలకు వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర జిల్లా యుటియఫ్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ర్యాలీగా ఖమ్మం నగరంలోనికి జాతా ప్రవేశించనైనది. అనంతరం ఖమ్మం జిల్లా జాతాను కలుపుకొని వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మీదుగా పతాక జాతా వెళ్ళింది. ఆయా సెంటర్ల వద్ద ఉపాధ్యాయులు ఘనమైన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు జియావుద్దీన్ జెండా ఊపి జిల్లా జాతాను ప్రారంభించారు. ఈ జాతాలో టియస్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్.రంజాన్, పారుపల్లి. నాగేశ్వరరావు,జి.వి. నాగమల్లేశ్వరరావు, బి.వెంకన్న , షమి, రాంబాబు, రాందాస్, ఉద్దండ్, సురేష్, నాగేశ్వరరావు, సుధాకర్, నవీన్ కుమార్, అరవింద్, శ్రీనివాసరావు, గురవయ్య, శచేంద్రబాబు సీనియర్ నాయకులు బి నరసింహారావు, రాజశేఖర్, వీరబాబు, కల్యాణం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ పాత్రికేయుడు గోశాల ప్రసాద్ మృతిపట్ల మంత్రి లోకేశ్‌ సంతాపం!

Ram Narayana

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్… ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్

Ram Narayana

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు! హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ కార్ల ర్యాలీ

Ram Narayana

Leave a Comment