Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫార్ములా ఈ-కార్ రేసులో క్విడ్ ప్రోకో జరిగింది: తెలంగాణ ప్రభుత్వం

  • బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో సంస్థ రూ. 41 కోట్లను ఇచ్చిందన్న ప్రభుత్వం
  • గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ ఎన్నికల బాండ్లు కొన్నాయని వెల్లడి
  • 26 సార్లు బాండ్లు కొన్నాయన్న ప్రభుత్వం

ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి పలు కీలక విషయాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని తెలిపింది. 

రేస్ ను నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్లలో లబ్ధి జరిగిందని వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లను గ్రీన్ కో సంస్థ చెల్లించిందని తెలిపింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 26 సార్లు బీఆర్ఎస్ బాండ్లు కొన్నాయని పేర్కొంది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొన్నాయని తెలిపింది. 

మరోవైపు, ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు వచ్చారు. అయితే, ఆయన లాయర్లను పోలీసులు అనుమతించకపోవడంతో… విచారణకు హాజరుకాకుండానే ఆయన వెనక్కి వచ్చేశారు. ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు సమాచారం. 

Related posts

దొడ్డి కొమరయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు… గద్దర్ చివరి కోరిక ఏంటంటే…!

Ram Narayana

కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్..

Ram Narayana

Leave a Comment