బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఈటల
-ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు
–హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం
-హాజరైన ఈటల రాజేందర్
-తనను బర్తరఫ్ చేయడం అరిష్టమని వ్యాఖ్యలు
-కేసీఆర్ పై ప్రతీకారం తప్పదని హెచ్చరిక
కాషాయం కండువా కప్పుకున్న మాజీమంత్రి ఈటల రెండవసారి హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు . ఉపఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . బీజేపీ తో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన వేళ దూకుడు పెంచారు …. నియోజకవర్గంలో తనకున్న పట్టును నిలుపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించటం అరిష్టమని శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హుంకరిస్తున్నారు …. గత 20 సంవత్సరాలుగా కడుపులో పెట్టుకున్న ప్రజలు బిడ్డ నీ వెనక నేను ఉన్నాను … టీఆర్ యస్ ఓడిపోవాల్సిందే అని అంటున్నారు …. కేసీఆర్ తనకు చేసిన అన్యానికి ప్రతీకారం తప్పదని ఈటల హెచ్చరించారు. హుజురాబాద్ లో టీఆర్ యస్ బీజేపీలు సై అంతే సై అంటున్నాయి. ఎన్నికల తేదీ రాకముందే వాతావరం వేడెక్కటంతో ప్రజలు మాత్రం రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు…. ఈటల ఇంటిటా ప్రచారం చేపట్టేందుకు సిద్దపడుతున్నారు … బీజేపీ రాష్ట్ర కేంద్ర నేతల పర్యటనలు ఉండబోతున్నాయి.
ఆదివారం హుజూరాబాద్ లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల నేటి సమావేశంలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తనను మంత్రివర్గం నుంచి అన్యాయంగా తొలగించారని, రాష్ట్రానికి అది అరిష్టం అని పేర్కొన్నారు. కేసీఆర్ ను దెబ్బకుదెబ్బ తీయడం ఖాయమని అన్నారు. తాను దేవుడి కంటే ముందు ప్రజలనే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదరించకపోతే ఈటల ఎక్కడ ఉండేవాడని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎవరైనా ఒకసారి హవాతో గెలవొచ్చని, రెండోసారి గెలవాలంటే సొంత సత్తా ఉండాల్సిందేనని ఈటల స్పష్టం చేశారు.
ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం కేసీఆర్ తరం కాదని వ్యాఖ్యానించారు. నాయకులను కొనుగోలు చేయవచ్చేమో కానీ, ప్రజలను కొనుగోలు చేయలేరని పేర్కొన్నారు.