Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం… కోర్టుకు తెలిపిన ప్రభుత్వం…

ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం… కోర్టుకు తెలిపిన ప్రభుత్వం
ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు అనుమతి
చుక్కల మందుకు అనుమతి నిరాకరణ
చుక్కల మందుపై అధ్యయనం
నివేదికలు సమర్పించాలన్న కోర్టు
తదుపరి విచారణ జులై 1కి వాయిదా

కరోనా కు బ్రహ్మస్త్రంగా చెప్పుకుంటున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య విషయం మరోసారి వార్తలలోకి వెక్కింది …. కడుపులోకి వేసుకునే ముందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం కంట్లో వేసే చుక్కలమందు విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది…. దానిపై అనేక పరీక్షల అనంతరం దానిలో ఆనికర పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది . ఇదే విషయాన్నీ కోర్టు కు తెలిపింది. ఇప్పటికే ముందు పంపిణి జరుగుతుండగా చుక్కల మందు అనుమతి కోసం ఎదురు చూస్తుంది. మందు పంపిణీకి ఇటు ప్రభుత్వం , అటు కోర్టు గతంలోని అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు చుక్కల మందు పై కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా చుక్కల ముందులో హానికర పదార్థాలు ఉన్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో దానికి అనుమతి ఇవ్వాలా లేదా అనే దానిపై విచారణ జులై 1 న వాయిదా వేసింది …..

ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ఆ మందుపై అధ్యయనం కొనసాగుతోందని నాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తాజాగా దీనిపై జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు ఆసక్తికర అంశం వెల్లడించారు.

ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం ఉందని తెలిపారు. ఈ పదార్థం కళ్లకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు చుక్కల మందును ఐదు ప్రయోగశాలల్లో పరీక్షించామని న్యాయవాది వివరించారు. అయితే ఆ ప్రయోగశాలలు రూపొందించిన నివేదికలు తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం విచారణను జులై 1కి వాయిదా వేసింది.

ఏపీ సర్కారుతో పాటు హైకోర్టు కూడా ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు ఓకే చెప్పడంతో రాష్ట్రంలో పలు చోట్ల మందు పంపిణీ జరుగుతోంది. అయితే కంట్లో వేసే చుక్కల మందుపై మాత్రం స్పష్టత రాకపోవడంతో, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య కుటుంబీకులు వేసే చుక్కల మందు కోసం తెలంగాణ నుంచి కూడా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వచ్చిన వారున్నారు.

Related posts

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా నేరం కాదు..షరతులు వర్తిస్తాయ్: నితిన్ గడ్కరీ!

Drukpadam

మేడారం జాతరను జాతీయ జాతరగా గుర్తించండి :కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

Drukpadam

దైనిక్ భాస్కర్ తో పాటు మరో న్యూస్ ఛానల్ పై ఐటీ దాడులు…

Drukpadam

Leave a Comment