Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శ్రీరాముడి పేరుతో సేకరించిన నిధులను బీజేపీ నేతలు దోచుకుంటున్నారు: కాంగ్రెస్…

శ్రీరాముడి పేరుతో సేకరించిన నిధులను బీజేపీ నేతలు దోచుకుంటున్నారు: కాంగ్రెస్
-రామ మందిర నిర్మాణం కోసం జరిగిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు
-రూ. 20 లక్షలకు కొన్న భూమిని బీజేపీ నేత రూ. 2.5 కోట్లకు విక్రయించారు
-విచారణ జరిపించాల్సిన బాధ్యత మోదీ, సుప్రీంకోర్టుదే
-కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సేకరించిన నిధులను బీజేపీ నేతలు ఇంకా దోచుకుంటూనే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రామమందిర నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీతోపాటు సుప్రీంకోర్టు ఇంకా మౌనంగానే ఉండడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు తక్షణం స్పందించి న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా తమ బాధ్యతలు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం నిర్మాణం పేరుతో దేశవ్యాపితంగా నిధులు వసూల్ చేశారు. డబ్బులే కాకుండా బంగారం ఇతర వస్తులువు వెండి కూడా దాతలు అందించారు . దీనిపై సరైన లెక్కలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల ద్వారా నిధులు వస్తువులు శ్రీరామ తీర్థ ట్రస్ట్ కు విరాళాలు జమ అయ్యాయి. వాటిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ నేత ఒకరు అయోధ్యలో 890 చదరపు మీటర్ల భూమిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసి 79 రోజుల తర్వాత ఆ భూమిని రామజన్మభూమి ట్రస్టుకు రూ. 2.5 కోట్లకు విక్రయించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని, ప్రధాని ఆధ్వర్యంలోనే రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటైంది కాబట్టి ఈ అక్రమాలపై స్పందించి విచారణ జరిపించాల్సిన బాధ్యత కూడా వారిదేనని సూర్జేవాల స్పష్టం చేశారు.

ఎస్పీ , ఆప్ పార్టీ సైతం ఆరోపణలు

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి విషయంలో అవకతవకలు  జరిగాయని ఎస్పీ నేత పవన్ పాండే , ఆప్ నేత సంజయ్ సింగ్ లు వేరు వేరుగా ఆరోపించారు .దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని పవన్ పాండే కోరగా , తాను కోర్టుకు వెళ్లనున్నట్లు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.

కాంగ్రెస్ ఆరోపణలను కొట్టి పారేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ /బీజేపీ

అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బీజేపీ లు కొట్టి పారేశాయి . ముసలిదైన కాంగ్రెస్ పార్టీ పాత పాటలనే పాడుతుందని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వారి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆలయం కోసం కొనుగోలు చేసిన భూమిని మార్కెట్ రేటుకన్నా తక్కువకే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు….

Related posts

నాపై అన‌ర్హ‌త వేటు వేయ‌లేరుగాక వేయలేరు…ఎంపీ రఘురామ…

Drukpadam

రోజా ఇంట్లో రాగిసంగటి, నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్ ఏంమాట్లాడారు?: రేవంత్ రెడ్డి…

Drukpadam

హరీశ్, రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం …

Drukpadam

Leave a Comment