Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరియమ్మ హత్యపై ముఖ్యమంత్రి స్పందిక పోవడం సిగ్గుచేటు: సీఎల్పీ నేత భట్టి…

మరియమ్మ హత్యపై ముఖ్యమంత్రి స్పందిక పోవడం సిగ్గుచేటు: సీఎల్పీ నేత భట్టి
– రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి
-దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
– కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఇందుకుకాదు
-నీ అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తాం -నీ మోసాలకు పాపం పండే రోజు వచ్చింది

ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళను దొంగతనంపేరుతో పోలీసులు అతి కిరాతకంగా హింసించి కొట్టిన దెబ్బలకు మరణిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించక పోవడం దారుణమని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్కఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో దళితులు బతికే హక్కు లేదా..?? దళితుల ప్రాణాలకు విలువే లేదా? అని భట్టి ప్రశ్నించారు . శాసనసభ ఆవరణలో మీడియా పాయింటు వద్ద కాంగ్రెస్ కు చెందిన సీనియర్ శాసనసభ్యులు జగ్గారెడ్డి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ దళిత జపంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ….ఒక దళిత మహిళను అర్థరాత్రి పూట పోలీసులు ఇంటికి వచ్చి మహిళా పోలీసులు లేకుండానే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ విఫరీతంగా కొట్టి అక్కడనుంచి అడ్డ గూడూరు తీసుకోని పోయి దారుంగా కొట్టి చిత్ర హింసలకు గురిచేసే హత్య చేస్తే పట్టించుకోని ముఖ్యమంత్రి చర్యలను భట్టి గర్హించారు. ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు … ఇందుకేనా అనేక మంది యువకులు , విద్యార్థుల ప్రాణత్యాగాలు …. బలిదానాలు అని ఆవేదన వ్యక్తం చేశారు …… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇందుకోసం కానే కాదని అన్నారు. ….. మరియమ్మ మరణంపై ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశామని అవసరమైతే ఎందాకైనా పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఆమె కుమారుడు ఉదయకిరణ్,కూతురు పాపం కేసీఆర్ కు తగలడం ఖాయమని ముఖ్యమంత్రికి భట్టి శాపనార్థాలు పెట్టారు …

ముఖ్యమంత్రి గత రెండుమూడు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ మరియమ్మ హత్యపై స్పందించకుండా …. దళితుల సాధికారిత గురించి మాట్లాడటం పచ్చి అబద్దమని ధ్వజమెత్తారు . దళితులకు మూడు ఎకరాల భూమి , దళిత ముఖ్యమంత్రి , ఉద్యోగాలు , ఉపాధి మాటలు అరిగిపోయిన రికార్డులే అని, ఇన్ని మోసపు మాటలు , ఇంత దగాకోరు ముఖ్యమంత్రిని ,ఇంతటి దారుణమైన పరిపాలన చూడలేదని ప్రజలు భావిస్తున్నారని భట్టి కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని దళితులు , గిరిజనులు, పేదవాళ్లపై గత ఏడేళ్ల నుంచి అనేక అకృత్యాలు జరుగుతున్న కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు .కేవలం రూ. రెండుల లక్షల దొంగతనం ఆరోపణలతో మరియమ్మ అనే దళిత మహిళను అన్యాయంగా, అతికిరాతకంగా కొట్టి చంపారని , సమాజంలో కోట్లకు కోట్లు దోచుకుంటున్న దొంగలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మరియమ్మ దళితురాలనే ఉద్దేశంతోనే హత్యచేశారా? అని నిలదీశారు .దీనిపై మేధావులు , రాజకీయపార్టీలు మానహతావాదులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
,
సిరిసిల్లలో దళితులపై దాడులు, మంథనిలో రాజబాబు హత్య గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. హత్యాకాండ జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి పాలన చూస్తుంటే ఈ రాష్ట్రంలో దళిత, గిరిజనుల ప్రాణాలను విలువే లేదనిపిస్తోంది.

కేసీఆర్ మాట్లాడకపోగా మరియమ్మ లాకప్ లో చనిపోయి మూడు రోజులు అవుతోంది. ఆమె కొడుకు డెబ్బలతో రోడ్డున పడి ఉన్నాడు. మేము వెళ్లి చూసి ఆసుపత్రిలో చేర్పించేవరకూ పట్టించుకునే నాథడే లేడు. ఇంత అన్యాయం జరిగితే.. ఇప్పటికి అట్రాసిటీ కేసు పెట్టలేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక తేలుస్తాం నీ సంగతి. ఈ ప్రజల బతుకులకు రక్షణ కల్పిస్తావా.. లేక మా రక్షణ మేమే చూసుకోవాలా? అని భట్టి కేసీఆర్ పై మండి పడ్డారు . ఎంతకాలం ఇంకా ప్రాణాలు ఫణంగా పెట్టి శవాల మీద నీ రాజవైభోగాలు అనుభవిస్తావో తేల్చుకుందాం అని ముఖ్యమంత్రిని భట్టి హెచ్చరించారు.

మానవహక్కుల కమిషన్ ను కలుస్తాం.. గవర్నర్ గారికి లేఖ రాశాం.. వారైనా స్పందిస్తారిని ఆసిస్తున్నాం. దీని కోసం ఉన్న వ్యవస్థలన్ని కదలిస్తాం. ఇంకా మౌనంగా ఉండే శక్తి మాకు లేదు. తప్పనిసరిగా ఈ మౌనాన్ని ఛేధించాలని మానవ హక్కుల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా.. ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ అని అన్నారు …
ఆత్మ గౌరవంతో, తల ఎత్తుకుని బతకడం కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా బలి పశువుల్లా మారిపోయి చనిపోవడానికి కాదు. దయచేసి మేధావుల్లారా ఆలోచించండిని విజ్ఞప్తి చేశారు ..

Related posts

జగన్ పై మరో సారి ఉండవల్లి ఆశక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …!

Drukpadam

దీపావళి ఎప్పుడు చేసుకోవాలన్నదానిపై అయోమయం…?

Drukpadam

Leave a Comment