Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పార్టీ మారడంపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఏమ‌న్నారంటే…!

  • గ‌త కొన్నిరోజులుగా అయోధ్య రామిరెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం
  • తాను పార్టీ మార‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ
  • అదంతా కేవ‌లం పుకారేన‌ని కొట్టిపారేసిన వైనం

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ మారతారని గ‌త కొన్నిరోజులుగా ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ వార్తలపై తాజాగా ఆయ‌న స్పందించారు. మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని తేల్చేశారు. తాను పార్టీ మార‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. అదంతా కేవ‌లం పుకారేన‌ని అయోధ్య రామిరెడ్డి కొట్టిపారేశారు. 

ఈ సంద‌ర్భంగా అయోధ్య రామిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజమేన‌ని, వాటిని తట్టుకుని నిలబడాలని పేర్కొన్నారు. ఇక, విజయసాయిరెడ్డి రాజ‌కీయాల నుంచి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని… ఆ విష‌యం క్లారిటీగా ఉన్న‌ప్పుడు, దాని ప్ర‌స్తావ‌న అన‌వ‌స‌రమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

విజయసాయిరెడ్డి వ్య‌క్తిగ‌తంగా చాలా మంచి వ్యక్తి అని అన్నారు. రాజకీయాల్లో ఎత్తుప‌ల్లాలు కామ‌న్ అని, ఓటమి వ‌చ్చిన‌ప్పుడు తట్టుకుని నిలబడాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత‌ వైసీపీ నేతలపై ఒత్తిడి బాగా పెరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు.

Related posts

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కూలిందడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?: జగన్

Ram Narayana

విద్యుత్ చార్జీల పెంపుపై 27 న వైసీపీ నిరసనలు …సజ్జల రామకృష్ణారెడ్డి

Ram Narayana

కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

Ram Narayana

Leave a Comment