ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌ల‌

  • ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల
  • ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ 
  • మార్చి 3న చేప‌ట్ట‌నున్న ఓట్ల లెక్కింపు 
  • తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

తెలంగాణ‌లో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదే స్థానంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. వీటితో పాటు వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ఉపాధ్యాయ నియోజ‌కవ‌ర్గానికి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

అటు ఏపీలో ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌కవ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. 

Related posts

ఝార్ఖండ్‌ ఎన్నికల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ…

Ram Narayana

ఏపీలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్: సీఈవో

Ram Narayana

కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం..

Ram Narayana