కొత్తగూడెంలో టీయూడబ్ల్యూజే సభత్వం నమోదును ప్రారంభించిన రాంనారాయణ …
143 కి గుడ్ బై ఐజేయూ తోనే తమ ప్రయాణమన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు
సభుత్వం స్వీకరించి ఐజేయూ కి జై కొట్టిన స్టాఫ్ రిపోర్టుర్లు
వచ్చే నెల 23 జిల్లా మహాసభ జరిపేందుకు సన్నాహాలు
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/ram-speech.jpeg?resize=1024%2C576&ssl=1)
టీయూడబ్ల్యూజే ఐజేయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 వ మహాసభను ఫిబ్రవరి 23 న కొత్తగూడం ప్రెస్ క్లబ్ లో నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి…అందుకు గాను సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు కొత్తగూడెం క్లబ్ లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించారు …ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిక్కచ్చిగా పోరాడుతుంది జర్నలిస్టులకు అండగా నిలుస్తుంది ఒక్క టీయూడబ్ల్యూజే మాత్రమేనని అన్నారు …సభ్యత్వం అనేది ప్రతి సంవత్సరం పాతవారిని రెన్యూవల్ చేసుకుంటూ కొత్తగా వచ్చిన వారికీ సభ్యత్వాలు ఇచ్చే ప్రక్రియ అని అన్నారు … సభ్యత్వానికి అనుగుణంగానే ఆయా కమిటీల్లో జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు …రాష్ట్రంలో బలమైన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం ఒకటని అనేక సందర్భాల్లో అధినిరూపితమైందని అన్నారు ..ఇళ్లు ,ఇళ్లస్థలాల సాధన ,ఆరోగ్య కార్డులు ,అక్రిడేషన్లు కోసం ఉద్యమాలు చేయాల్సిందేనని అందుకు జర్నలిస్టులను ఐక్యం చేయాలనీ కోరారు .. మనకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భావనలో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారని ఆ భ్రమల్లో ఉండవద్దని అన్నారు …రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కొత్త సానుకూలంగా ఉన్న ఆదిమనకు చుట్టమేమి కాదని స్పష్టం చేశారు …ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పోరాటాలు లేకుండా సాధించబడలేదని ఇక ముందు కూడా అంతేనని అన్నారు ..ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు అసంబద్ధంగా ఉందని దానిపై ఇప్పటికే హైద్రాబాద్ జర్నలిస్టులు రివిజన్ పిటిషన్ వేశారని అది ఏమి జరుగుతుందో చూడాలని అన్నారు ..ఇప్పటివరకు సాధించుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు మన యూనియన్ రాష్ట్ర కార్యాలయం దేశద్ధారక భవనం కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు …
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/ramarao-ku-sabhyatwam-1-1.jpeg?resize=1024%2C576&ssl=1)
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/uday-ki.jpeg?resize=1024%2C576&ssl=1)
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/anand-ku.jpeg?resize=1024%2C576&ssl=1)
సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తరలిరావడం చాలా సంతోషంగా ఉందని రాంనారాయణ అన్నారు. ఈ సందర్భంగా యూనియన్ మీద ఉన్న నమ్మకంతో ఇతర యూనియన్ల నుండి భారీ ఎత్తున స్టాఫర్లు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున వచ్చి ఐజేయూ యూనియన్లో సభ్యత్వ నమోదు చేయించుకోవడం శుభ పరిణామం అని అన్నారు . మరికొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు … ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు, యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు దుద్దుకూరి రామారావు జిల్లా కార్యదర్శి మబకాపు ఆనంద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జనుమాల రమేష్, ఖమ్మం యూనియన్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు కనుకు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఎర్ర ఈశ్వర్, పెండ్యాల భాస్కరరావు , వీర మోహన్, జి శ్రీనివాస్, చంద్రశేఖర్, వీరభద్రం, నరసింహారావు, జైనుల్లాబుద్ధిన్, బి శంకర్, దశరథ్ రజువ, భాస్కర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల కొత్తగూడెం క్లబ్ కార్యదర్శిగా ఎన్నికైన కోనేరు పూర్ణచందర్ రావుకు సన్మానం
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/sanmanam-.jpeg?resize=1400%2C787&ssl=1)
ఇటీవల కొత్తగూడెం క్లబ్ కార్యదర్శిగా ఎన్నికైన కోనేరు పూర్ణచందర్ రావు (పెద్ద బాబు ) కు టీయూడబ్ల్యూజే కొత్తగూడెం కమిటీ ఆధ్వరంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ చేతుల మీదగా సన్మానం జరిగింది …ఈ సందర్భంగా పూర్ణచందర్ రావు మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని ,అందుకు జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరారు …తనను ఆప్యాయంగా పిలిచి సన్మానం చేసిన టీయూడబ్ల్యూజే నాయకులకు ,సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు ..
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2025/01/purna-chandar-rao-speech-.jpeg?resize=1024%2C576&ssl=1)