Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేవెగౌడకు షాక్.. రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు!

దేవెగౌడకు షాక్.. రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
2011లో నైస్ సంస్థపై విమర్శలు చేసిన దేవెగౌడ
నైస్ ఒక దోపిడీ సంస్థ అన్న మాజీ ప్రధాని
పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించలేమన్న కోర్టు

మాజీ ప్రధాని దేవెగౌడకు బెంగళూరులోని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాకిచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం దేవెగౌడ చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం దావా చెల్లించాలని తీర్పును వెలువరించింది.
ఏ విషయం గురించి ఆచితూచి మాట్లాడే దేవెగౌడ ప్రతిష్టాత్మకమైన తమ సంస్ఠగురించి ఒక దోపిడీ సంస్థ అంటూ మాట్లాడి తమ ప్రతిష్టను దిగజార్చారని నైస్ అనే ఒక కంపెనీ కోర్టులో పరువు నష్టం దావా వేసింది. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇంటర్యూ లో దేవెగౌడ చెప్పిన మాటలు ఆయనపై అభియోగం మోపి సంస్థ రేపిటషన్ దెబ్బతిన్నదని ఓకీభవించిన కోర్టు దేవగౌడకు నష్ట పరిహారం కింద 2 కోట్లు చెల్లించాలని తీర్పు రావడం ఆశక్తిగా మారింది.

వివరాల్లోకి వెళ్తే… బీదర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) సంస్థ గురించి దేవెగౌడ విమర్శించారు. నైస్ ఒక దోపిడీ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. 2011 జూన్ నెలలో ఓ ఇంటర్వ్యూలో ఆయన సదరు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గౌడర గర్జనే’ పేరుతో ఓ వార్తా ఛానల్ ఆ ఇంటర్వ్యూని ప్రసారం చేసింది.

ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థలో పరువు నష్టం దావా వేసింది. దేవెగౌడ వ్యాఖ్యల వల్ల తమ సంస్థ పరువు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థాయం ఈరోజు తీర్పును వెలువరించింది. నైస్ సంస్థకు నష్ట పరిహారంగా రూ. 2 కోట్లను చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. పరువు నష్టం కలిగించే ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించలేమని… వీటిని అనుమతిస్తే, భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రాజెక్టును అమలు చేయడం కష్టమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

Related posts

‘స‌లాం తాలిబ‌న్స్’ అంటూ పాక్ లో బాలిక‌లతో బ‌ల‌వంతంగా గీతం పాడించిన వైనం..

Drukpadam

నియో నాజీలనుంచి ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించేందుకే సైనిక చర్య :పుతిన్!

Drukpadam

ప్రధానికి భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతి ఆందోళన…

Drukpadam

Leave a Comment