Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట!

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట
ఆమె ఎస్సీ కాదంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నవనీత్ కౌర్
నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పుపై స్టే

అమరావతి ఎంపీ నవనీత కౌర్ కుల ధ్రువీకరణ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన బాంబే హైకోర్టు తీర్పుతో ముగిసిందని భావిస్తున్న తరుణంలో సుప్రీం కోర్ట్ స్టే విధించడం ఆమెకు ఊరట నిచ్చే అంశం … అంటే కాకుండా ఈ కేసును పరిశీలించేందు వారిదగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు దారునికి , మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది . సుప్రీం కోర్ట్ విచారణలో ఎలాంటి తీర్పు రానున్నదనే విషయంలో దేశవ్యాపితంగా ఆశక్తి నెల కొన్నది .

మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వడ్ లోకసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీ గెలుపొందిన నవనీత్ కౌర్ ఆమె అసలు ఎస్సీ నే కాదంటూ ,ఆమె పై పోటీ చేసి ఓడిపోయిన శివసేన అభ్యర్థి కోర్టు కు వెళ్లడం జరిగింది. కోర్టు ఆమె ఎస్సీ కాదంటూ ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే ….దీంతో ఆమె సుప్రీం తలుపు తట్టింది . ఆమె కు సుప్రీంకోర్టులో స్టే లభించడంతో ఊరట కలిగింది. ఆమె గత ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు, నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీనిపై నవనీత్ కౌర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఫిర్యాదుదారుకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. అయితే, నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, ఆమె ఎస్సీ కాదని శివసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ విచారణ జరిపి, నవనీత్ కౌర్ మోసపూరితమైన రీతిలో కల్పిత పత్రాలను సమర్పించినట్టు అభిప్రాయపడింది. ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.

Related posts

భూసర్వే పేరుతో మహాయజ్ఞం: సీఎం జగన్

Drukpadam

మతిమరుపా …? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే …!

Drukpadam

హైదరాబాదులో నారా భువనేశ్వరి రాజమండ్రిలో బ్రహ్మణి ఢిల్లీ లో లోకేష్ డ్రమ్మలు మోగించిన కార్యక్రమంలో

Ram Narayana

Leave a Comment