Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం… !

  • 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చామన్న రాష్ట్రపతి
  • భారత ఏఐ మిషన్ ను ప్రారంభించామని వెల్లడి
  • 3 కోట్ల మందిని లక్ పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న రాష్ట్రపతి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. 

రాష్ట్రపతి ప్రసంగంలోని ప్రధాన అంశాలు:

  • రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుంది.
  • త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్టీయే ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పని చేస్తోంది.
  • 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చాం. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను అమలు చేస్తున్నాం.
  • పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. అదనంగా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను పొడిగించాం.
  • ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం.
  • ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం.
  • నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశాం. యువతకు నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం.
  • ఒలింపిక్ పతకాలు సాధిస్తూ, కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తూ మహిళలు దేశం గర్వించేలా చేస్తున్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు.
  • నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పిస్తున్నాం. 3 కోట్ల మందిని లక్ పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
  • మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ ను భారత్ ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు.
  • కృత్రిమ మేధ విషయంలో ‘భారత ఏఐ’ మిషన్ ను మొదలుపెట్టాం. భారత్ ను గ్లోబల్ ఇన్నొవేషన్ పవర్ హౌస్ గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం.
  • డిజిటల్ టెక్నాలజీలో అంతర్జాతీయంగా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. మన యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయి.
  • సైబర్ సెక్యూరిటీలో సమర్థత కోసం కృషి చేస్తున్నాం. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, డీప్ ఫేక్ వంటివి ఆర్థిక, సామాజిక, దేశ భద్రతకు సవాళ్లుగా మారాయి.
  • ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చాం.
  • దేశ పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది.
  • ట్యాక్స్ విధానాలను సరళీకరించాం.
  • రూ. 70 వేల కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి.

Related posts

50 లక్షల 65 వేల కోట్లతో కేంద్రం భారీ వార్షిక బడ్జెట్!

Ram Narayana

విజయసాయి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్!

Ram Narayana

ప్రధాని ప్రసంగం బోర్ కొట్టిందంటూ ప్రియాంక సెటైర్

Ram Narayana

Leave a Comment