- థాయ్‌లాండ్‌లోని పుకెట్ నగరానికి హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
- శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పుకెట్ నగరానికి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయిందన్న ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరానికి తొలి విమానం శుక్రవారం బయలుదేరింది. ఈ విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కొత్త సర్వీసు ద్వారా ఫుకెట్ – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఆయన అన్నారు. ఈ విమానం 3.45 గంటల్లో గమస్థానానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ప్రస్తుతం ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తాయని, 15వ తేదీ నుంచి వారానికి ఆరు విమానాలకు పెంచుతామని ఆయన వెల్లడించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ, హైదరాబాద్ – ఫుకెట్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.