Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రష్యా నుంచి వెనక్కి వెళ్లిపోతున్న ఉత్తర కొరియా సైనికులు!

  • ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా కిమ్
  • 10 వేల మంది సైనికులను రష్యాకు పంపించిన ఉత్తర కొరియా
  • కొరియన్ సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదన్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యాకు 10 వేల మంది సైనికులను కిమ్ పంపించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారులు సంచలన ప్రకటన చేశారు. 

తమతో పోరాడలేక కిమ్ సైనికులు రష్యా నుంచి వెనుదిరుగుతున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తమతో జరుగుతున్న యుద్ధంలో గత మూడు వారాలుగా ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదని చెప్పారు. తమ సైనికులను ఎదుర్కోలేక వారు వెనుదిరుగుతున్నారని తెలిపారు. 

ఉక్రెయిన్ అధికారులు చేసిన ప్రకటనపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. కొంత కాలంగా ఉక్రెయిన్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోందని… వారి వ్యాఖ్యలపై ప్రతిసారి స్పందించలేమని చెప్పింది. 

మరోవైపు 10 వేల మంది కిమ్ సైనికులకు రష్యా ప్రత్యేక శిక్షణ ఇచ్చి యుద్ధ రంగంలోకి దింపింది. అయితే రష్యా, కొరియన్ సైనికుల మధ్య భాష కారణంగా సమన్వయం లోపించింది. కొరియన్ సైనికులు సరిగా యుద్ధం చేయలేని పరిస్థితి నెలకొంది. 

ఇంకోవైపు ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ… చనిపోయిన ఉత్తర కొరియా సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా రష్యా సేనలు కాల్చివేస్తున్నాయని తెలిపారు. మరోవైపు, ఈ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇరు దేశాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని ఇప్పటికే ఆయన సూచించారు. చర్చలకు రష్యా ముందుకు రాకపోతే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తానని కూడా హెచ్చరించారు.

Related posts

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై ఆ దేశ జాతిపిత బొమ్మ తొలగింపు!

Ram Narayana

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి ఫోన్…!

Ram Narayana

యూట్యూబ్ చానల్‌తో సాకర్ స్టార్ రొనాల్డో కళ్లు చెదిరే సంపాదన!

Ram Narayana

Leave a Comment