బీజేపీ ఆశలకు చిరంజీవి నీళ్లు పోశారా…?
జన్మలో రాజకీయాల జోలికి వెళ్లను… నా ఆశయ సాధనకు పవన్ ఉన్నాడు: చిరంజీవి
బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో బ్రహ్మా ఆనందం
నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
బీజేపీ ఆశలకు చిరంజీవి నీళ్లు పోశారా ..? అంటే ఆయన మాటలను బట్టి ఠక్కున అవుననే సమాధానమే వస్తుంది …రాజకీయాల్లో ఆయన అనుభవించిన క్షోభ గురించి , ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన పరిస్థితులను గురించి ఒక సినీ ఫంక్షన్ లో వివరించి తన మనుసులో మాటను వెల్లడించి బరువు దించుకున్నారు ..
.మెగాస్టార్ గా పేరున్న చిరంజీవి రాజకీయాలపై మనసు మళ్ళి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు …ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కలలు కన్నాడు ..పార్టీ సభలకు లక్షలాది జనం రావడంతో చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని అభిమానులు, భావించారు …కానీ 292 నియోజకవర్గాల్లో పోటీచేయగా కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి..ఆయన రెండు కైకలూరు , తిరుపతి నియోజకవర్గాల నుంచి చోట్ల పోటీ చేసి తిరుపతి నుంచి మాత్రమే గెలుపొందారు ..శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చున్నారు … రాజకీయాలు ఒంటబట్టించుకుందుకు ప్రయత్నించారు ..చివరకు ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సీటు తీసుకోని కాంగ్రెస్ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయ్యారు … కాంగ్రెస్ కేంద్రంలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటి ముట్టనట్లుగా వ్యహరించారు …చివరకు సైలంట్ అయ్యారు …చిరంజీవికి ఉన్న చరిస్మాను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది …ప్రధాని మన్యం జిల్లాలో సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వేదికపై హాగ్ చేసుకున్నారు …అక్కడ నుంచి బీజేపీ ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకోని రావాలని ప్రయత్నాలు ప్రారంభించింది …చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి… ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో చిరంజీవికోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయసాయిరెడ్డిని రాజీనామా చేయించిందని ప్రచారం జరిగింది … స్వభావ రీత్యా తన మనుసులో ఉన్న అభిప్రాయాలు చెపితే నొచ్చు కుంటారని అలా నొప్పించడం ఇష్టం లేక వారు ఏది అన్న వింటూ మౌనంగా ఉండటంతో బీజేపీ వైపు నుంచి కూడా చిరంజీవి తమను అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగింది …తనపై వస్తున్న రూమర్లపై ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్న చిరంజీవి చివరకు ఒక సినిమా ఫంక్షన్ లో తన మనసులో మాటను బయట పెట్టారు ..తాను జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళాను గాక వెళ్లానని తెగేసి చెప్పారు …దీంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లుయింది … దీంతో బీజేపీ తన ప్రయత్నాలకు ఇక ఫుల్ స్టాప్ పెడుతుందో లేక ఆయన మనసు మార్చేందుకు కొనసాగిస్తుందో అనేది ఆసక్తిగా మారింది ..
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఇందులో బ్రహ్మానందం తాతగా, రాజా గౌతమ్ ఆయన మనవడిగా నటించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులను వివరించారు.
“ఇక నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను. నా ఆశలు, ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజాసేవ చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు… ఇక నేను పూర్తిగా సినిమా రంగానికే అంకింత అవుతాను. ఇటీవల నేను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండడంతో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు… రాజకీయంగా నేను ఎలాంటి ముందడుగు వేయడంలేదు. చిత్ర పరిశ్రమలోనే ఉంటాను.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎంతో ఒత్తిడి అనుభవించాను. నన్ను మాటలు అన్నవాడ్ని, ఏమీ అనని వాడ్ని కూడా తిట్టాల్సి వచ్చేది. ఏం తిట్టాలో కూర్చుని మరీ రాసుకోవాల్సి వచ్చేది.
నేను గంభీరంగా మారిపోవడం చూసి ఓ రోజు సురేఖ అడగనే అడిగింది… ఏంటండీ మీరు అసలు నవ్వడమే మానేశారు అంది. నాకే అనిపించింది… నాలోని హాస్య గ్రంథులు దొబ్బేశాయా అనుకున్నాను. కానీ రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక నాలోని వినోదం మళ్లీ వచ్చింది” అని చిరంజీవి వివరించారు.