జాతీయ వార్తలు

ఆసియాలో సంప‌న్న కుటుంబాల జాబితా.. అగ్ర‌స్థానం స‌హా టాప్‌-10లో 4 భార‌తీయ ఫ్యామిలీలు!

  • ఆసియాలో అత్యంత సంప‌న్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసిన‌ బ్లూమ్‌బ‌ర్గ్ 
  • అత్యంత ధ‌నిక ఫ్యామిలీగా రూ. 7.86ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో ముకేశ్ అంబానీ కుటుంబం 
  • నాలుగో స్థానంలో మిస్త్రీ కుటుంబం (రూ. 3.25 ల‌క్ష‌ల కోట్లు)
  • ఏడు, తొమ్మిదో స్థానాల్లో వ‌రుస‌గా జిందాల్, బిర్లా ఫ్యామిలీలు

ఆసియాలోనే అత్యంత సంప‌న్న కుటుంబాల జాబితాను తాజాగా బ్లూమ్‌బ‌ర్గ్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో మ‌న భార‌తీయ కుటుంబం అగ్ర‌స్థానంలో నిలిచింది. అలాగే జాబితాలో టాప్‌-10లో నాలుగు భార‌తీయ ఫ్యామిలీలు చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. 

కాగా, ఆసియాలో అత్యంత ధ‌నిక ఫ్యామిలీగా రూ. 7.86ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్ర‌స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో థాయ్‌లాండ్‌కు చెందిన చీరావ‌నోండ్ కుటుంబం (రూ. 3.70ల‌క్ష‌ల కోట్లు) నిలిచింది. 

ఇక మూడో స్థానంలో ఇండోనేషియాకు చెందిన హ‌ర్టోనో ఫ్యామిలీ (రూ. 3.66 ల‌క్ష‌ల కోట్లు) ఉంటే… నాలుగో స్థానాన్ని రూ. 3.25 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో మిస్త్రీ కుటుంబం ద‌క్కించుకుంది. అలాగే ఏడు, తొమ్మిదో స్థానాల్లో వ‌రుస‌గా జిందాల్ (రూ. 2.44ల‌క్ష‌ల కోట్లు), బిర్లా (రూ. 1.99ల‌క్ష‌ల కోట్లు) ఫ్యామిలీలు నిలిచాయి. 

Related posts

భారత ఇంధన రంగంలో కీలక పరిణామం.. అండమాన్‌లో గ్యాస్ నిధులు!

Ram Narayana

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

Ram Narayana

రెండు గంటలు సలహా ఇచ్చి రూ. 11 కోట్లు తీసుకున్నా: ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana