Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు…

  • తాడిపత్రిలో న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వహించిన జేసీ
  • ఆ ఈవెంట్ కు వెళ్లొద్దంటూ మహిళలకు మాధవీలత సూచన
  • మాధవీలత వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  

వివరాల్లోకి వెళితే, న్యూ ఇయర్ సందర్భంగా మహిళల కోసం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. అదే సమయంలో ఈవెంట్ గురించి మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈవెంట్ కు మహిళలు ఎవరూ వెళ్లవద్దని… ఈవెంట్ నిర్వహిస్తున్న స్థలం సురక్షితం కాదని ఆమె సూచించారు. ఆమె వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. ఆమె ఒక వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాధవీలతకు క్షమాపణలు చెబుతూ.. ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు.  

అయితే, జేసీ వ్యాఖ్యలపై కొన్ని రోజుల క్రితం మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేపీ వ్యాఖ్యలు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాయని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ క్షమాపణ చెప్పిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం చర్ఛనీయాంశంగా మారింది.

Related posts

సామాన్య ప్రయాణికుడిలా బస్సెక్కి సిటీ బస్సు సేవలపై ఆరా తీసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. గుర్తుపట్టని డ్రైవర్, కండక్టర్!

Drukpadam

భారత్ రాఫెల్ కు పోటీగా… చైనా నుంచి జే-10సీ యుద్ధ విమానాలను అందుకున్న పాకిస్థాన్!

Drukpadam

హిజాబ్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!: నిఘా వర్గాల హెచ్చరిక!

Drukpadam

Leave a Comment