అంతర్జాతీయంప్రమాదాలు ...

అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. ఇద్ద‌రి మృతి!

  • అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు
  • ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు
  • ప్రమాదంలో ఇద్దరి మృతి

అమెరికాలో వ‌రుస విమాన ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌త నెల 31న‌ ల్యాండ్ అవుతున్న ఓ విమానాన్ని హెలికాప్ట‌ర్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో 67 మంది మృత్యువాత‌ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. తాజాగా అమెరికాలో సింగిల్ ఇంజిన్‌తో కూడిన రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు మృతి చెందారు. 

ఈ ప్ర‌మాదం తాలూకు వీడియో ఒక‌టి నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అమెరికా కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం ఉద‌యం ర‌న్ వే పై సెస్నా 1725, లాంకైర్ 360 ఎంకే 11 ఢీకొన్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Related posts

ట్రంప్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు: కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబం..

Ram Narayana

షాకింగ్‌ ఘటన.. యువకుడిని కరిచి .. నిమిషాల్లోనే చనిపోయిన విష‌పూరిత పాము!

Ram Narayana

పాక్ ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా కాశ్మీర్ టెర్రరిస్టు భార్య !

Ram Narayana