Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప గుడ్ బై ..బీఆర్ యస్ లో చేరతారా …?

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ … మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా
గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన ఫ్లై ఓవర్ ను ప్రభుత్వం రద్దు చేయడంతో అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని మండిపాటు

సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన హస్తం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్, బీఆర్ఎస్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్రంగా ఉంటానని చెప్పారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని వీడిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోనప్ప ఏడాది పాటు కూడా కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయన సీఎం రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కోనప్ప తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం కోనప్ప చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని ఆయన మండిపడ్డారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు.

కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా గుడ్ బై చెప్పారు. తాజాగా జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఆయన మద్దతు ప్రకటించారు.

అయినా ఆయన తిరిగి బీఆర్ యస్ పార్టీలో చేరుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …

Related posts

బీఆర్ఎస్ తప్పులపై 100 అంశాలతో బీజేపీ ఛార్జ్ షీట్!

Ram Narayana

బలిదానాల తెలంగాణలపై అవినీతి రాజ్యమేలుతుంది …కేసీఆర్ పాలపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు …

Ram Narayana

పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన…

Ram Narayana

Leave a Comment