Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఉద్యోగికి క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్!

  • శ్రీవారి ఆలయంలో ఉద్యోగిని దూషించిన టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్
  • రెండ్రోజులుగా టీటీడీ ఉద్యోగుల నిరసనలు
  • నేడు ఉద్యోగ సంఘాలతో టీటీడీ అధికారుల సమావేశం

ఇటీవల తిరుమలశ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ ఓ ఉద్యోగిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నరేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ ఉద్యోగులు గత రెండ్రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో, నేడు ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ పై బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ చేసిన దూషణల పట్ల ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగి బాలాజీ సింగ్ కు టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పారు. నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసినట్టయింది.

కాగా, ఈ వ్యవహారంపై టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ స్పందిస్తూ… తనకు ఎదురైన అనుభవం పట్ల మూడు రోజుల పాటు ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. 

Related posts

అద్భుత ఆటతో ఫిఫా ప్రపంచ కప్ లో క్వార్టర్స్ చేరిన అర్జెంటీనా!

Drukpadam

నాడు జగన్ చేసిన చట్టాన్ని నేడు చంద్రబాబు రద్దు చేశారు …

Ram Narayana

బంగ్లాదేశ్ లో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష !

Drukpadam

Leave a Comment