Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తన తల్లికి అనారోగ్యం అంటూ వార్తలు… చిరంజీవి అసహనం!

  • మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత అంటూ వార్తలు
  • ఆసుపత్రిలో చేరారంటూ కథనాలు
  • క్లారిటీ ఇచ్చిన చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అనారోగ్యం అంటూ ఈ ఉదయం నుంచి మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మెగా టీమ్ ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తల్లి అస్వస్థతకు గురైందంటూ వార్తలు రావడం పట్ల అసహనం వెలిబుచ్చారు.

“మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని, ఆమె ఆసుపత్రి పాలయ్యారంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలు నా దృష్టిలో పడ్డాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. రెండ్రోజులుగా ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారంతే. ఇప్పుడామె ఎంతో హుషారుగా, హాయిగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. నేను మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే… దయచేసి ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాగానాలు పబ్లిష్ చేయొద్దు. అర్థం చేసుకుంటే సంతోషం!” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Related posts

ఇక సెలవు… జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను: పోసాని…

Ram Narayana

ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు…

Ram Narayana

ఏపీ నుంచి రిలీవ్… తెలంగాణ సీఎస్‌కు ఆ ముగ్గురు అధికారులు రిపోర్ట్!

Ram Narayana

Leave a Comment