Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… జగన్ హాజరయ్యే అవకాశం!

  • మరో రెండ్రోజుల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం
  • అసెంబ్లీకి ఒకరోజు వచ్చి వెళ్లిపోయే ఆలోచనలో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం, ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది. 

కాగా, ఈసారి వైసీపీ అధినేత జగన్ తో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే… వరుసగా 60 పనిదినాల పాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే, సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో… జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

ఏపీ శాసనసభలో తీవ్ర గందరగోళం.. సభ వాయిదా

Ram Narayana

శాసనసభ సాక్షిగా ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వడానికి స్పీకర్ ప్రయత్నించారు: అచ్చెన్నాయుడు

Ram Narayana

ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

Ram Narayana

Leave a Comment