Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

2023-24లో రూ. 58,104 కోట్ల పన్నులు చెల్లించిన అదానీ గ్రూప్ కంపెనీలు

దేశీయ బిలీయనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు పన్ను పారదర్శకత నివేదికను ఆదివారం విడుదల చేసింది. దీని ప్రకారం, 2023-24లో అదానీ గ్రూప్ కంపెనీలు మొత్తం రూ. 58,104 కోట్ల పన్నులు చెల్లించాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన రూ. 46,610 కోట్ల కంటే అత్యధికం. ఈ పన్ను చెల్లింపుల్లో అదానీ కంపెనీలకు చెందిన గ్లోబల్ ట్యాక్స్, డ్యూటీలు, ఇతర ఛార్జీలు, పరోక్ష పన్నులు, వాటాదారుల తరపున చెల్లించిన సుంకాలు, ఉద్యోగుల కోసం వినియోగించిన సామాజిక ఖర్చులు, ఇతర సుంకాలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో సంస్థ బాధ్యతను నెరవేరుస్తూ, జవాబుదారీతనంతో దేశ ఆర్థికవ్యవస్థకు చేరే ప్రతి రూపాయికి పారదర్శకత కల్పిస్తూ, అదానీ గ్రూప్ నిబద్దతను పన్ను నివేదిక ప్రతిబింబిస్తుందని గౌతమ్ అదానీ అన్నారు … ఈ నివేదిక ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుకోగలమని, పన్ను పారదర్శకత నివేదిక కార్పొరేట్ రంగంలో బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని తెలిపారు. నివెదికలో అదానీ గ్రూప్ యాజమాన్యంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సహా ఏడు కంపెనీలతో పాటు ఇటీవల కొనుగోలు చేసిన ఎన్‌డీటీవీ, ఏసీసీ సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ లకు చెల్లించిన పన్నులు ఉన్నాయి. అయితే 2024 -25 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించాల్సి ఉంది ..

Related posts

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు!

Ram Narayana

మణిపూర్ హింసను ఖండిస్తూ.. మిజోరంలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన మిజోరం సీఎం, మంత్రులు

Ram Narayana

ఆ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి రావాలి: నిర్మలా సీతారామన్

Ram Narayana

Leave a Comment