Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్ ఉపఎన్నిక..అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ…

హుజూరాబాద్ ఉపఎన్నిక..అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ…
-మండలాలకు,నియోజకవర్గానికి ఇన్ఛార్జిలను నియమించిన బీజేపీ
-ఈటల రాజీనామాతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక
-నియోజకవర్గ కోఆర్డినేటర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
-మొన్న దుబ్బాక… రేపు హుజూరాబాద్… ఫలితంలో మార్పు ఉండదన్న రఘునందన్ రావు
హుజూరాబాద్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు
త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల
ఈటల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికే హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు .ఆత్మగౌరవానికి ,కేసీఆర్ అహంకారానికి జరుగుతున్న ఎన్నికల్లో కేసీఆర్ పతనం ప్రారంభమయిందని ఈటల ఘాటు విమర్శలు చేస్తున్నారు . ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. అందులో భాగంగానే అత్యంత పకడ్బందీగా ప్లాన్ రూపొందించుకుంటుంది ….క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ లు , గ్రామ కమిటీ లను నియమించి వారికీ భాద్యతలు అప్పగించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. దీనికోసం మండలాలకు రాష్ట్ర నాయకత్వంలోని ముఖ్యులను నియమించారు. ఇప్పటికే వారు రంగంలోకి దిగారు. బీజేపీ ఎన్నికల కోసం రంగంలోకి దిగింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇన్ఛార్జిలను బీజేపీ నియమించింది. హుజూరాబాద్ టౌన్ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అరవింద్, జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లను నియమించారు. నియోజకవర్గ కోర్డినేటర్ గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది. ఇరిలో కొందరు ఇప్పటికే రంగంలోకి దిగారు .

దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొన్న దుబ్బాకలో ఎలాంటి ఫలితం వచ్చిందో, రేపు హుజూరాబాద్ లోనూ అదే పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీ శ్రేణులు దుబ్బాక కంటే కాస్త ఎక్కువే శ్రమించాల్సి ఉంటుందని రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

దుబ్బాకలో ఎన్నికల సందర్భంగా ఎదురైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామని, హుజూరాబాద్ లోనూ అందుకు మినహాయింపు కాదని, అయితే ఇక్కడ దుబ్బాక కంటే రెండు పనులు ఎక్కువే చేయాలని శ్రేణులకు నిర్దేశించారు. హుజూరాబాద్ లో బీజేపీ మండలాల ఇన్చార్జిల సమావేశంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఈ ఎన్నికను ఎంత ఛాలంజ్ గా తీసుకున్నదో అర్థం అవుతుంది.

Related posts

పెగాసెస్‌పై చ‌ర్చించ‌డానికి వీల్లేదు: టీడీపీ ఎమ్మెల్యేలు!

Drukpadam

అక్క కోసం రంగంలోకి దిగిన చెల్లి

Drukpadam

యూపీ ఎన్నికల్లో మాయావతి రాష్ట్రపతి అంటూ ప్రచారం చేసిన బీజేపీ !

Drukpadam

Leave a Comment