ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఉదయం 10.00 గంటల వరకు 20.35 శాతం పోలింగ్
మధ్యాహ్నం 12.00 గంటల వరకు 54.34 శాతం
మధ్యాహ్నం 2.00 గంటల వరకు 79.53 శాతం
సాయంత్రం 4.00 గంటల వరకు 93.05 శాతం
రిక్కాబజార్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు, సాయంత్రం 4.00 గంటల వరకు 93.05 శాతం పోలింగ్ నమోదు అయిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్, ఖమ్మం రిక్కా బజార్ హైస్కూల్ లో ఉన్న టీచర్స్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ శాసన మండలిలో టీచర్స్ స్థానాల ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 24 పోలింగ్ కేంద్రాలలో టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్ ట్లు తెలిపారు.

జిల్లాలో 4089 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారని, ఉదయం 8.00 గంటల నుంచి ఉదయం 10.00 గంటల వరకు 20.35 శాతం, మధ్యాహ్నం 12.00 గంటల వరకు 54.34 శాతం, మధ్యాహ్నం 2.00 గంటల వరకు 79.53 శాతం, సాయంత్రం 4.00 గంటలకు 93.05 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు…
సాయంత్రం 4.00 గంటల వరకు టీచర్స్ ఎన్నికలలో 3805 మంది ఓటు వేయగా, అందులో 2218 మంది పురుష ఓటర్లు, 1587మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ ముగిసిన తర్వాత నల్గోండలో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోసం అవసరమైన బందోబస్తు, ఏర్పాట్లు పోలీసులు కట్టుదిట్టంగా చేశారని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ అన్నారు.