Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ నుంచి అండమాన్ కు… కొత్త ప్యాకేజీ తీసుకువచ్చిన ఐఆర్ సీటీసీ!

  • సమ్మర్ కోసం ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ
  • 5 రాత్రులు, 6 పగళ్ల వ్యవధితో ప్రత్యేక ప్యాకేజీ
  • పర్యాటకులు అండమాన్ నికొబార్ దీవుల అందాలను ఆస్వాదించేందుకు..

అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో విహరించాలని కోరుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని భావించే వారికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే దీవులను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

ఐఆర్‌సీటీసీ రూపొందించిన హైదరాబాద్ టు అండమాన్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.

5 రాత్రులు, 6 పగళ్ళ వ్యవధి గల ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, నెయిల్ ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్ సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఈ ప్యాకేజీ మార్చి 12న ప్రారంభం కానుంది. మొదటి రోజు ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కి ఉదయం 9 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శించి, లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదించవచ్చు. రెండో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్‌లాక్ ద్వీపానికి వెళ్లి రాధానగర్ బీచ్‌లో విహరించవచ్చు. మూడో రోజు హేవ్‌లాక్ ద్వీపంలోని కాలాపత్తర్ బీచ్ చూసిన తర్వాత ప్రీమియం క్రూయిజ్ ద్వారా నెయిల్ ఐలాండ్ చేరుకుంటారు. సాయంత్రం సీతాపూర్ బీచ్‌లో గడిపి రాత్రికి నెయిల్ ఐలాండ్‌లో బస చేస్తారు.

నాలుగో రోజు భరత్‌పూర్ బీచ్‌లో స్విమ్మింగ్, బోట్ రైడ్, వాటర్ యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. అనంతరం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. ఐదో రోజు రోస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శించి రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు. ఆరో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ అయి 9 గంటలకు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు: సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.68,320, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.49,960గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.42,950, 2 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్ లేకుండా రూ.39,525 వసూలు చేస్తారు.

ఈ ప్యాకేజీలో స్నాక్స్, వాటర్ గేమ్స్, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, టిప్స్ వంటివి ఉండవు. విమాన ప్రయాణం, సందర్శన స్థలాల ప్రయాణ ఖర్చులు, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, స్టార్ హోటల్‌లో బస, సందర్శనా స్థలాలకు ప్రవేశ రుసుము, గైడ్ ఛార్జీలు ఈ ప్యాకేజీలో కలిపి ఉంటాయి.

Related posts

తిరుమల దర్శనం… తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు చంద్రబాబు అంగీకారం!

Ram Narayana

రంగరాజన్ పై దాడి హేయం… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: ఏపీ సీఎం చంద్రబాబు

Ram Narayana

శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత… !

Ram Narayana

Leave a Comment