Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తమిళ భాష పత్తాలేకుండా పోతుంది: సీఎం స్టాలిన్ ఆందోళన!

  • పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులకు స్టాలిన్ బహిరంగ లేఖ
  • హిందీని కేంద్రం బలవంతంగా రుద్దాలనుకుంటోందని ఆందోళన
  • హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య

హిందీ భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమయిందని… అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈరోజు తన జన్మదినోత్సం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు. 

జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను కేంద్రం మనపై బలవంతంగా రుద్దాలనుకుంటోందని స్టాలిన్ విమర్శించారు. పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవడం తనకు అలవాటని… కానీ ఈసారి హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని… అందుకే పార్టీ శ్రేణులందరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మనం అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రంలో హిందీ భాష రాజ్యమేలుతుందని, తమిళ భాష పత్తాలేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ, త్రిభాషా విద్యా విధానం అత్యంత అవసరమని చెప్పారు. 

Related posts

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో ఇండియా స్థానం ఎంత?

Drukpadam

కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు శాఖల కేటాయింపు…

Ram Narayana

ఫిబ్రవరి 13న డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ!

Ram Narayana

Leave a Comment