- ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైనదన్న బఫెట్
- భారీ సుంకాలను విధించడాన్న దుందుడుకు చర్యగా పేర్కొన్న బఫెట్
- అమెరికా ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికర అంశమని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా, కెనడా, మెక్సికో దేశాలపై భారీ ఎత్తున సుంకాలను విధించడాన్ని దుందుడుకు చర్యగా ఆయన పేర్కొన్నారు. ‘ఆ తర్వాత ఏంటి? అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న’ అని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికర అంశమని… దాని గురించి తాను మాట్లాడనని అన్నారు. దాని గురించి మాట్లాడటం కష్టమని చెప్పారు.
94 ఏళ్ల వారెన్ బఫెట్ ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్టర్ గా పేరుగాంచారు. ఆయన ఇచ్చే టిప్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు.