Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం..మంత్రి పొంగులేటి

ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం..మంత్రి పొంగులేటి

  • పెనుబల్లి మండలంలో మంత్రి పర్యటన
  • రామ చంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపన
  • కల్లూరులోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15నెలలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ వ్యవధిలో మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని ఇందుకు గాను ఇప్పటి వరకు 5,450 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు. రూ. 20,676కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఏడాదిలోనే 56వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రూ. 500కే గ్యాస్ అందించిన ఘనత తమదేనన్నారు. తాజాగా మూడు రోజుల క్రితం రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో నూతన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఒక్కో నియోజక వర్గంలో సుమారు 4000మందికి పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7లక్షల కోట్లకు పైగా అప్పులకు ప్రతినెల రూ. 6500 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని తెలిపారు. ఆ కారణంగానే కొన్ని హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వడం లక్ష్యమని తెలిపారు. తొలి విడతలో ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500బోనస్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇన్ని చేస్తున్నా ప్రతి పక్షాలు ఓర్వలేక తమ పై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రామచంద్రపురంలో కొంతమంది రైతులు ఏళ్లుగా ప్రభుత్వ అటవీ భూమిని సాగుచేసుకుంటున్నారని వాటికి ప్రభుత్వం తరుపున చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టేకులపల్లి గ్రామంలో అవిరామ్ సర్వీస్ స్టేషన్ ను ప్రారంభించారు. స్థానికంగా ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

అదేవిధంగా కల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎర్రబోయినపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ లకు శంకుస్థాపన చేశారు. పెద్దకోరుకొండి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ తో పాటు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి ప్రసంగించారు.

  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు మంత్రి పొంగులేటి ఇఫ్తార్ దావత్
  • 1500మందికి పైగా ముస్లిం సోదరులు హాజరు

ఏదులాపురం మున్సిపాలిటీ : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు…ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందుని ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరైన ఈ ఇఫ్తార్ దావత్ లో నియోజకవర్గంలోని సుమారు 1500మందికి పైగా ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలు కోరిన అన్ని కోరికలు తీర్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. కోరిక చిన్నదైనా, పెద్దదైనా వాటిని చిత్త శుద్ధితో నెరవేరుస్తామని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస్ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈ పథకంలో ముస్లిం మైనార్టీలకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 40నుంచి 45 మసీదులు ఉన్నాయని వాటి అభివృద్ధికి ఈ నెల 30న జరుపుకునే రంజాన్ పండుగకు ముందుగానే ఒక్కో మసీదుకి రూ. లక్ష చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కబర్ స్టాన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈద్గా ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గత ఏడాది వచ్చిన వరదల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వంతన పై చిక్కుకున్న కొంతమంది వరద బాధితులను రక్షించిన సుభానిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు అతనికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

Related posts

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం….జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Ram Narayana

ఎన్నికల నిబంధనలను పాతర …ప్రలోభాలకు స్వేచ్చ…సిపిఎం ఘాటు విమర్శ

Ram Narayana

అసెంబ్లీ ఎన్నిలలో వీడియో గ్రఫీ చేసినవీడియో గ్రాఫ్రార్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి..

Ram Narayana

Leave a Comment