- పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
- ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ట్రస్ట్
- ఏయే ఆహార పదార్థాలు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయో లిస్ట్ షేర్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్
ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుందనే విషయం తెలిసిందే. విద్య, వైద్య, మహిళా సాధికారత, విపత్తు సహాయం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ, మెరిట్ స్కాలర్ షిప్ లను కూడా ఇస్తుంది. ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా కూడా అనేక విషయాలలో ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సూచనలు చేస్తుంటుంది. తాజాగా… ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఏయే ఆహార పదార్థాలు ఉపయోగపడతాయో ఓ జాబితాను విడుదల చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ లిస్ట్ పై ఓ లుక్కేయండి.
ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహారాలు:
- జ్వరం – కొబ్బరి నీరు
- దగ్గు – పైనాపిల్
- వికారం – అల్లం
- మొటిమలు – బాదం
- మైకము – పుచ్చకాయ
- రక్తహీనత – పాలకూర
- బలహీనత – ఖర్జూరం
- నిద్ర సమస్యలు – కివి
- కీళ్ల నొప్పి – వాల్‌నట్స్
- పొడి చర్మం – అవకాడో
- నోటి దుర్వాసన – ఆపిల్
- కడుపు నొప్పి – బొప్పాయి
- కండరాల వాపులు – పసుపు
- కంటి బలహీనత – క్యారెట్లు
- సైనస్ ఇన్ఫెక్షన్ – వెల్లుల్లి
- కొవ్వు కాలేయం – దుంపలు
- అరుగుదలకు – మిరియాల టీ
- రోగనిరోధక వ్యవస్థ – పుట్టగొడుగులు
- గుండెల్లో మంట, కొలెస్ట్రాల్ – ఓట్స్