Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్…

కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్
-రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియదని ముఖ్యమంత్రి అనడం భాద్యత రాహిత్యం
-మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ డెత్
-సీఎం వారం తర్వాత స్పందించారన్న ఉత్తమ్
-కాంగ్రెస్ నేతలు చెబితేనే స్పందించారని ఆరోపణ
-దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడి

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అంశంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ఎస్సీ మహిళ లాకప్ డెత్ దారుణమని పేర్కొన్నారు. లాకప్ డెత్ పై కాంగ్రెస్ నేతలు చెబితే వారం తర్వాత సీఎం కేసీఆర్ స్పందించారని విమర్శించారు. సీఎల్పీ బృందం కలిసినప్పుడు, లాకప్ డెత్ గురించి తనకు తెలియదని సీఎం అన్నారని ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు.

12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.

ఇంతటి భాద్యత రహితమైన ముఖ్యమంత్రి ని ఏ నాడు చూడలేదని అన్నారు .రాష్ట్రంలో పాలనా ఏనాడో గాలికి వదిలేసినా కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైయ్యారని ఆరోపించారు. దళితులపట్ల ఏ మాత్రం కనికరం లేదని ఓట్ల అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ కు దళితులూ గుతుకు వస్తుంటారని అన్నారు. దళిత ఎంపర్మెంట్ పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు . దళిత మహిళా మరియమ్మ లాక్ డెత్ జరిగితే దానిగురించి పట్టించుకున్న పాపాన పోలేదని చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు వెళ్లి చెబితే తనకు తెలియదని చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు. మరి అలంటి అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత కేసీఆర్ కు ఏమాత్రం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Related posts

మా ప్రభుత్వం వస్తే వదిలే ప్రసక్తే లేదు: పోలీసులకు యరపతినేని వార్నింగ్!

Drukpadam

మీ వినాశనానికే ఇదంతా చేస్తున్నారు: ఈటల రాజేందర్…

Drukpadam

మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందే : బండి సంజయ్…

Drukpadam

Leave a Comment