Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

భార‌తీయుల‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంప‌రాఫ‌ర్‌.. విమాన టికెట్ల‌పై 30 శాతం డిస్కౌంట్‌!

  • ఈ వేస‌విలో త‌మ సంస్థ విమానాల్లో ప్ర‌యాణించే ఇండియ‌న్స్‌కు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫ‌ర్‌
  • టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్‌, వార్సా, ప్రాగ్ రూట్ల‌లో ప్ర‌యాణించే వారికి ఆఫ‌ర్ వ‌ర్తింపు
  • మార్చి 28 వ‌ర‌కు  త‌గ్గింపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు
  • ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చని వెల్ల‌డి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ వేస‌విలో త‌మ సంస్థ విమానాల్లో ప్ర‌యాణించే భార‌తీయ ప్ర‌యాణికుల‌కు 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్రకటించింది.

టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్‌, వార్సా, ప్రాగ్ రూట్ల‌లో ప్ర‌యాణించే వారికి ఈ ప్ర‌త్యేక డిస్కౌంట్ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. మార్చి 28 వ‌ర‌కు త‌గ్గింపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసుకున్న‌వారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చని పత్రికా ప్రకటనలో ఎతిహాద్ ఎయిర్‌వేస్ పేర్కొంది. 

Related posts

కొనసాగుతున్న పసిడి పరుగు.. రూ. 85 వేలు దాటేసిన పుత్తడి ధర…

Ram Narayana

దిగ్గజ కంపెనీలను వెనక్కు నెట్టి దూసుకుపోతున్న బి ఎస్ ఎన్ ఎల్!

Ram Narayana

సమస్యను పరిష్కరించాం… ఇలా చేయండి!: మైక్రోసాఫ్ట్

Ram Narayana

Leave a Comment