అంతర్జాతీయం

చైనాకు ట్రంప్ మరో వార్నింగ్.. 24 గంటల డెడ్ లైన్!

  • అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించిన చైనా
  • వెంటనే వాపస్ తీసుకోవాలని హెచ్చరించిన ట్రంప్
  • లేదంటే అదనంగా 50 శాతం పన్నులు విధిస్తామని వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోమారు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాపై విధించిన 34 శాతం ప్రతీకార సుంకాలను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. 24 గంటల్లో ప్రతీకార సుంకాలను రద్దు చేయకుంటే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఓ పోస్టు పెట్టారు.

ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై పెద్దమొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఇటీవల విదేశాలపై టారిఫ్ లు విధించారు. ఇందులో భాగంగానే చైనాపైనా 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ అమెరికాపైనా అంతే మొత్తంలో (34 శాతం) ప్రతీకార సుంకాలను విధించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్ లు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతీకార సుంకాలను విధించాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని చైనాను హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరికలను లైట్ గా తీసుకున్న చైనా

Trumps Warning Ignored by China
  • తమపై విధించిన 34 శాతం సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలన్న ట్రంప్
  • 48 గంటల డెడ్ లైన్ విధించిన వైనం
  • అమెరికా బెదిరింపులకు భయపడేది లేదన్న చైనా

చైనా – అమెరికాల మధ్య టారిఫ్ ల యుద్ధం ముదురుతోంది. తమ దేశంపై విధించిన 34 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో చైనాపై అదనంగా 50 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. దీనికి 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు.

ట్రంప్ వార్నింగ్ ను చైనా చాలా లైట్ గా తీసుకుంది. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపులు మంచిది కాదని చెప్పింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు. ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోమని చెప్పారు. చైనా తన చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకుంటుందని తెలిపారు.

Related posts

జర్మనీలో కొత్త సామాజిక సంక్షోభం.. పెరుగుతున్న ఏకాకులు, పేదరికం

Ram Narayana

కెనడాలో పడరాని పాట్లు పడుతున్న భారత విద్యార్థులు..

Ram Narayana

భారత్ పర్యటన నాకు చాలా ప్రత్యేకం.. నన్ను ఆప్యాయంగానే అలా పిలుస్తారు: రిషి సునక్

Ram Narayana