- బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో రేగా, వనమా
- కొత్తగూడెం నుండి వేలాదిగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపు
కేసీఆర్ పేరును చెరిపేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతా రావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రలో మరో బాపూజీ అని కొనియాడారు. గురువారం ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక సమావేశం కొత్తగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ నాడు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తిరోగమిస్తుందన్నారు. ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని విమర్శించారు. అబద్దం, అన్యాయం, మోసమే కాంగ్రెస్ పాలకుల విధానమని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికకె ఈనెల 27న వరంగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభను ఒక పండుగలా నిర్వహించ బోతున్నామని, దీనిని విజయవంతం చేసేందుకు వేలాదిగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా10 లక్షల మంది తరలి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, సీనియర్ నాయకులు కిలారి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీలో బాదావత్ శాంతి, బుక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, తదితరులు పాల్గొన్నారు.