రూ.100 కోసం యూనివర్సిటీ మాజీ వీసీ హత్య!
ఒడిశాలో దారుణ సంఘటన
సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ దారుణహత్య
నివాసంలోకి చొరబడిన దుండగుడు
డబ్బు కోసం డిమాండ్
నిరాకరించిన మాజీ వీసీ
గొడ్డలితో దాడి చేసిన దుండగుడు
ఒడిశాలో దారుణం జరిగింది. కేవలం 100 రుపాయాలు ఇవ్వలేదని యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సులర్ ను హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది . దీనిపై ఒడిశా ప్రభుత్వం చాల సీరియస్ గా తీసుకున్నది . హంతకుడిగా భావిస్తున్న వ్యక్తిని సమీపంలోని ఫారెస్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నారు. చూడటానికి చాల చిల్లి రీజన్ లా కనపడుతున్న తన శేష జీవితం తన స్వగ్రామంలో గడుపున్న పర్యావరణ ప్రేమికుడు అయిన వీసీ ని హత్య చేయడంపై ఒక్కసారిగా ఓడిశాలోని మేధావి వర్గం ఉలిక్కి పడింది. అయితే గ్రామంలో పర్యావరణాన్ని కాపాడుండుకు ఆయన నిరంతరం పాటుపడటంతో పాటు చెరువు విషయంలో కూడా స్థానికులు ద్రుబరాజ్ నాయక్ తో గొడవపడ్డారు . దీంతో హత్యపై దర్యాప్తు జరుపుతున్నారు …. వివిరాలు ఈ విధంగా ఉన్నాయి…..
డబ్బు కోసం ఎంత ఘాతుకానికైనా పాల్పడే కిరాతకులు ఉన్న రోజులివి! ఒడిశాలో రూ.100 కోసం ఓ యూనివర్సిటీ మాజీ వీసీని హత్య చేయడం అందుకు పరాకాష్ఠ. సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ ఝార్సుగూడ జిల్లాలోని సర్గిగూడలో నివసిస్తున్నారు. ఇవాళ ఆయనం నివాసంలోకి చొరబడిన ఓ దుండగుడు నగదు డిమాండ్ చేశాడు. మాజీ వీసీ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందడంతో ఆ దుండగుడు అక్కడ్నించి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆయన బయట ఉండగానే దుండగుడు ఇంట్లో కు ప్రవేశించాడు . బయట నుంచి వచ్చిన ద్రుబరాజ్ దుండగున్ని ప్రశ్నించారు. 100 లేవు ఉన్న ఇవ్వను పొమ్మన్నాడు . వెంటనే గొడ్డలితో ద్రుబరాజ్ పై దాడి చేసి తీవ్రంగా నరికాడు . స్థానికులు వెంటనే ద్రుబరాజ్ ను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు .
ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న 20 ఏళ్ల ప్రబిణ్ ధరువాను సమీపంలోని అటవీప్రాంతంలో ఉండగా అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
కాగా, మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ పర్యావరణవేత్తగానూ ప్రసిద్ధికెక్కారు. తాను నివాసం ఉంటున్న గ్రామంలోనే ఆయన మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో చెట్లు నరికిన కొందరు గ్రామస్తులతో తగాదాలు, ఓ చెరువు విషయంలో వివాదం కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బికాస్ చంద్ర దాస్ వెల్లడించారు.