Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ స్ట్రాటజీ …మెత్తబడుతున్న నేతలు …విహెచ్ గీతోపదేశం

రేవంత్ స్ట్రాటజీ …మెత్తబడుతున్న నేతలు …విహెచ్ గీతోపదేశం
వ‌రుస‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను క‌లుస్తోన్న రేవంత్ రెడ్డి!
పొన్నాల‌ను క‌లిసిన రేవంత్
మరోపక్క చిన్నారెడ్డితో భేటీ
ఆసుప‌త్రిలో వీహెచ్ వ‌ద్ద‌కు రేవంత్
తనను పరామర్శించిన రేవంత్ రెడ్డికి సూచనలు చేసిన వీహెచ్!
ఆసుపత్రిలో ఉన్న వీహెచ్ కు రేవంత్ పరామర్శ
ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై చర్చించారన్న రేవంత్
అతి పెద్ద దళిత ద్రోహి కేసీఆర్ అని మండిపాటు

తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితులైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైయ్యారు . అందులో భాగంగానే తనకు పదవి రాకుండా అడ్డుపడి బహిరంగంగా ప్రకటనలు చేసిన విహెచ్ ని మర్యదపూర్వకంగా కలిశారు. విహెచ్ ఆనారోగ్యంతో ఆసుపత్రి లో ఉన్న విషయం తెలుసుకున్న రేవంత్ , హైదర్ గూడా లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి విహెచ్ ని పలకరించారు. విహెచ్ కూడా తనను కలిసేందుకు వచ్చిన రేవంత్ కు కొన్ని గీతోపదేశాలు చేశారు. ఇద్దరిమధ్య సృహద్భావం వాతావరణంలో విహెచ్ చెప్పినమాటలు విన్న రేవంత్ అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు .

అంతకు ముందు ఉదయం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో క‌లిసి మాట్లాడారు. అనంత‌రం చిన్నారెడ్డిని కూడా రేవంత్ క‌లిశారు. అక్కడి నుంచి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న వి.హనుమంతరావును కలిసి పరామర్శించారు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ వీహెచ్ రెండు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. హాస్పిటల్ లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చర్చించారని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు సూచించారని చెప్పారు. పార్టీ అభివృద్ధి విషయానికి సంబంధించి కొన్ని సలహాలను ఇచ్చారని తెలిపారు. సోనియాగాంధీ వద్దకు కలిసి వెళదామని చెప్పారని అన్నారు.

ఈ ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే… ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పారని… కానీ, ఇంత వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. వీహెచ్ ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకు వెళతానని చెప్పారు.

కాగా, ఈ రోజు మ‌రికొంత మంది కాంగ్రెస్ నేత‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. పీసీసీ అధ్య‌క్షుడిగా త‌నకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆయ‌న కోరనున్నారు .

Related posts

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…..జోగు రామన్న

Drukpadam

2024 ఎన్నికలతో ఈ ఫలితాలకు సంబంధంలేదన్న మమతా బెనర్జీ!

Drukpadam

ఢిల్లీలో తెలంగాణా నేతలతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ,నడ్డా భేటీ!

Drukpadam

Leave a Comment