Oscars 2026
అంతర్జాతీయం

2026 మార్చి15న ఆస్కార్ అవార్డుల వేడుక

  • వివరాలు వెల్లడించిన అకాడమి
  • ఏఐ మూవీలకు అవార్డులు

98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలను అకాడమీ వెల్లడించింది. ఆస్కార్ పోటీ జాబితాను 2026 జనవరి 22న వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే, పలు కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపింది. నామినేట్ చేసిన ప్రతి మూవీని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా చూస్తారని తెలిపింది. ఈసారి అచీవ్ మెంట్ ఇన్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుందని, తుది ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది. ఈసారి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి నిర్మించిన మూవీలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే ఇది ఇతర మూవీలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఏఐ మూవీల కంటే సాధారణ మూవీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అకాడమీ వెల్లడించింది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ లో ఈ అవార్డుల వేడుక జరగనుండగా, జనవరి 2025 నుంచి డిసెంబర్ వరకు విడుదలైన మూవీలు ఆస్కార్ అవార్డులకు పోటీ పడనున్నాయి. మ్యూజిక్ విభాగంలో మాత్రం తుది గడువు ఈ ఏడాది అక్టోబర్ 15గా నిర్ణయించడం జరిగిందని తెలిపింది.

Related posts

జేడీ వాన్స్ ఫ్యామిలీకి ఏనుగులతో ఘన స్వాగతం

Ram Narayana

కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య.. ఇంటి బయటే కాల్చివేత..

Ram Narayana

వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని భేటీ.. భారత్ తో ఉద్రిక్తతలపై చర్చ!

Ram Narayana