Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భట్టిని అభినందించిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్…

భట్టిని అభినందించిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్
-తెలుగు రాష్ట్రాలలో దళితులపై దాడులపట్ల ఆందోళన
-కాంగ్రెస్ పక్షాన దళితుల సమస్యలపై పోరాడేందుకు నిర్ణయం
-అంతకు ముందు హర్ష కుమార్ మరియమ్మ కుమారుడిని పరామర్శించారు

 

తెలంగాణాలో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ పక్షాన పోరాడి పోలీసులను సస్పెండ్ చేయించటమే కాకుండా , కుటంబానికి అండగా ఉండి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా కృషిచేసిన సీఎల్పీ నేత భట్టిని విక్రమార్క ను అమలాపురం మాజీఎంపీ హర్షకుమర్ అభినందించారు.

ఆదివారం ఖమ్మం వచ్చిన సందర్భంగా సీఎల్పీ నేత భట్టి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు . ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో దళితులపై జరుగుతున్నా దాడుల విచయం చర్చించి ఆందోలన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలలో దళితులపై జరుగుతున్న దాడుల పెరుగున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వాల అలసత్వం కారణంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపొయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఇద్దరు నాయకులు చర్చించుకున్నారు.

ఎస్సి కమిషన్ ఢిల్లీ వరకు మాత్రమే పరిమితం అయింది.అదేవిధంగా దళితులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ పరంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు .

మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించిన హర్ష కుమార్

ఖమ్మం వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవల పోలిసుల లాకప్ డెత్ లో మరణించిన మరియమ్మ కుమ్మరుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. పోలీస్ ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. పోలిసుల తీరు గర్హనీయం అని అన్నారు . ప్రభుత్వ పరంగా వారికుటుంబానికి న్యాయం జరిగేలా సీఎల్పీ నేత భట్టి వ్యవహరించిన తీరును అభినందించారు. దళితులపై జరుగుతున్నా దాడులపై ప్రభుత్వాలకు బుద్ది వచ్చేలా చేయాలనీ అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

 

Related posts

ఈవీఎం లను తరలించే బస్సు లను టీఆర్ యస్ హోటల్ నేత దగ్గర ఆపారు …బీజేపీ నేత డీకే అరుణ ఫిర్యాదు …

Drukpadam

తాను నమ్మకున్న పార్టీ నిర్ణయంపైనే తన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉంటుంది …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

Drukpadam

యూపీలో బీజేపీకి ఎదురుగాలి… సమాజ్ వాదీ గూటికి చేరిన మరో మంత్రి!

Drukpadam

Leave a Comment