Australian PM Albanese secures historic second term as prime minister
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధానమంత్రి అల్బనీస్

ఆస్ట్రేలియాలోని తాజా సమాఖ్య ఎన్నికలు అనేక ఉత్కంఠలకు తెరదించాయి. ప్రజలు తమ ఓటుతో మరోసారి లేబర్ పార్టీకి విజయాన్ని కట్ట బెట్టారు. ఆ పార్టీ నాయకుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మరో సారి అధికారాన్ని చేపట్టే అవకాశం దక్కించుకున్నారు. ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, ఇది ఆయన నాయకత్వంపై ప్రజల మళ్లీ పెట్టిన మద్దతు అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఏంటంటే, ప్రతి పక్ష లిబరల్ పార్టీ నాయకుడు పీటర్ డట్టన్ బ్రిస్బేన్‌లోని తన సొంత డిక్సన్ సీటును కోల్పోవడం. లేబర్ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్ చేతిలో ఆయన ఓడిపోవడం ఆ పార్టీ శిబిరాన్ని షాక్‌కి గురి చేసింది. గతంలో 2007లో అప్పటి ప్రధాని జాన్ హోవార్డ్ తన సొంత స్థానాన్ని కోల్పోయిన ఘటన తరవాత, ఇప్పుడు మరో సారి ఓ ప్రధాన నాయకుడు ఓడిపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

Related posts

ట్రంప్‌కు కోపం వస్తుందేమో … సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన పుతిన్!

Ram Narayana

నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. కానీ నేనే రిజెక్ట్ చేశా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

ఇరాన్ యుద్ధం… విమాన టికెట్ ధరలు భగ్గు భగ్గు…

Ram Narayana