- ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
- బయటకు ఎవరూ రావొద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాలు
- మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు పాటించాలని సూచన
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్‌కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
అంతకుముందు, తెల్లవారుజామున 4:39 గంటలకు కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: