అంతర్జాతీయం

ఎస్400 ధ్వంసం చేశామంటిరి కదా.. తమ దేశ సైన్యాన్ని నిలదీసిన పాక్ జర్నలిస్ట్!

  • భారత ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ పర్యటన ఫొటోతో ట్వీట్
  • మోదీ వెనక ఎస్400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ కనిపిస్తోందని వెల్లడి
  • పాక్ సైన్యం (డీజీ-ఐఎస్‌పీఆర్) తప్పుడు ప్రచారం చేసిందన్న పాక్ జర్నలిస్టు

పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన పర్యటన, పాకిస్థాన్ సైన్యం ప్రచారంలోని డొల్లతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. తాము జరిగిన ఘర్షణల సమయంలో ఈ వైమానిక స్థావరాన్ని, అక్కడి ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకున్న పాకిస్థాన్ వాదనలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి (డీజీ-ఐఎస్‌పీఆర్) అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు. తప్పుడు విజయాలు ప్రకటించుకుంటున్నారని, వాస్తవానికి భారత దళాలు పాకిస్థాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, సదరు పాకిస్థానీ జర్నలిస్టు ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు. “ఈ స్థావరాన్ని, ఈ ఎస్-400 వ్యవస్థను మేం నాశనం చేశామని చెప్పుకున్నాం. కానీ, నరేంద్ర మోదీ అదే ఎస్-400 ముందు నిలబడి తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేం గెలవలేదు. 1971 తర్వాత భారతదేశం పాకిస్థాన్‌లోని ప్రతి నగరం, ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది. మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోదీ పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు,” అని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. మోదీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని, తమవారిలో 50 మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు.

Related posts

మిస్సింగ్ విమానం జాడ చెప్పిన స్మార్ట్ వాచ్.. అమెరికాలో ఘటన…

Ram Narayana

అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు!

Ram Narayana

ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ…

Ram Narayana