Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్ కుటుంబం లో జలవివాదం… తెలంగాణ నీటికోసం అన్నతో షర్మిల ఢీ…

వైయస్ కుటుంబం లో జలవివాదం… తెలంగాణ నీటికోసం అన్నతో షర్మిల ఢీ
తెలంగాణ నీటి కోసం ఎవరితో పోరాడేందుకైనా నేను సిద్ధం అంటున్న షర్మిల
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నాం
రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసింది సోషల్ మీడియానే
తెలంగాణ ప్రయోజనాల కోసం  పోరాడతాం
సోషల్ మీడియా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా షర్మిల

వైయస్సార్ కుటుంబంలో జలవివాదం అన్న చెల్లెలు మధ్య యుద్ధం తప్పేలా లేదు …. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ , తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న షర్మిల ఎవరి రాష్ట్ర ప్రయోజాలకోసం వారు నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది … దీంతో ఇద్దరి మధ్య యుద్ధం అనివార్యం అనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం జరిగితే ఉరుకుంటామా ? అని జగన్ అంటుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడతామని షర్మిల ,అందుకు ఎందాకైనా పోయేందుకు సిద్ధమేనని ప్రకటించారు…. అన్న , చెల్లలు మధ్య గతంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు వైయస్ కుటుంబంలో కొత్త చిక్కుని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఆమె స్పందిస్తూ… తెలంగాణ ప్రయోజనాల కోసం తాము పోరాడతామని చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరినైనా ఎదిరించేందుకు తాము సిద్ధమేనని అన్నారు. తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా సహించబోమని హెచ్చరించారు.

తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపించబోతున్నట్టు వైయస్ షర్మిల తెలిపారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడటానికి నాలుగు స్తంభాలు చాలా ముఖ్యమని… అవి కూడా చేయలేనిది చేసేదే ఫిఫ్త్ ఎస్టేట్ అని… అదే సోషల్ మీడియా అని చెప్పారు. నెటిజెన్ల మద్దతు లేకుండా తాను ఏమీ చేయలేనని అన్నారు.

జులై 8వ తేదీన తమ పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల చెప్పారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిని చేసింది సోషల్ మీడియా నే అని తెలిపారు. టీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఉద్యోగులు ఉన్నారని అన్నారు. కానీ, తమకు ఆ అవసరం లేదని, వైయస్సార్ అభిమానులే తమ సైన్యమని చెప్పారు. పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అన్ని విషయాలను లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా కార్యకర్తలందరూ యాక్టివ్ గా ఉండాలని సూచించారు. అన్యాయన్ని ఎదిరించేలా, ఫేర్ వార్తలను ఎండగట్టేలా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.

 

Related posts

మోడీ, జగన్ లపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

కమ్మకులం పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని!

Drukpadam

పార్టీ ప్రెసిడెంటా గా ? లేదా లోకసభాపక్షనేతగా?? రాహుల్ గాంధీ

Drukpadam

Leave a Comment