Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదు: తేజస్వీ యాదవ్…

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదు: తేజస్వీ యాదవ్
కాంగ్రెస్‌ సహితంగానే జాతీయ కూటమి ఏర్పాటు అవసరం ఉంది
దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్య
200 స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరు
మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం
ఎన్డీయే ప్రభుత్వం నియంతృత్వ సర్కార్‌

నిన్న ఎన్సీపీ నేత మరాఠా యోధుడు శరద్ పవర్ నేడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ విషయంలో ఒకే విధంగా స్పందించారు.కాంగ్రెస్ లేకుండా మూడవ కూటమి నాలగవ కూటమి అంటూ వస్తున్నా వార్తలను వారు కొట్టిపడేశారు.దేశంలో కాంగ్రెస్ లేని కూటమి వ్యర్థం అని శరద్ పవర్ అభిప్రాయపడగా , తేజస్వి యాదవ్ బీజేపీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లేకుండా కూటమి అనేది సాధ్యంకాదన్నారు. అందుకు ఆయన కారణాలు కూడా వివరించారు.

దేశవ్యాపితంగా 200 పార్లమెంట్ స్థానాలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నే పోటీపడుతుందని అన్నారు. మిగతా స్థానాలలో ప్రాతీయపార్టీలకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇటీవల శరద్ పవర్ నివాసంలో ప్రతిపక్షాల సమావేశం గురించిన వివరాలు తనకు తెలియదని అన్నారు.అనేక రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదిరించి నిలిచి గెలిచినా విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన జాతీయ పార్టీ అని తేజస్వీ యాదవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్ఠాయిలో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ఏదైనా కూటమి ఏర్పాటైతే అది కాంగ్రెస్‌ సహితంగానే ఉండడం సహజమని అభిప్రాయపడ్డారు.

దేశంలో దాదాపు 200 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యక్షంగా పోటీ పడతాయని తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఆ స్థానాలపై కాంగ్రెస్‌ దృష్టి సారించి మిగిలిన సీట్లలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఏం నిర్ణయించారో తనకు తెలియదన్నారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఫాసిస్టు, నియంతృత్వ, విభజనవాద, అణచివేసే సర్కార్‌గా తేజస్వీ యాదవ్‌ అభివర్ణించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించేందుకు కనీస ఉమ్మడి ప్రణాళికతో పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశం కలిసికట్టుగా ఉంటుందో లేక విభజనకు గురవుతుందో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని తమ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2014 ఎన్నికల సందర్భంగా అన్నారని.. ఇప్పుడు ఆయన మాటలే నిజమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

 

 

 

 

 

 

Related posts

అమరావతి రైతు యాత్రలో 60 మంది మాత్రమే రైతులు …బొత్స

Drukpadam

దూకుడు పెంచిన జగన్ సర్కార్

Drukpadam

పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్ళరు …భట్టి అసత్య ప్రచారం మానుకో …అనుయాయులు..!

Drukpadam

Leave a Comment