Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్​ హెచ్చరికలతో దిగొచ్చిన ఈయూ దేశాలు!

భారత్​ హెచ్చరికలతో దిగొచ్చిన ఈయూ దేశాలు!
కొవిషీల్డ్ కు 7 దేశాల ఆమోదం
ఆ వ్యాక్సిన్ కూ జాబితాలో చోటు
లిస్ట్ లో లేని టీకాలేసుకుంటే క్వారంటైన్ తప్పనిసరి
కొవిషీల్డ్, లను తీసుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ లేకుండా అనుమతి
అంతకు ముందు ఇండియాలో తయారైన టీకాలకు అనుమతి ఇవ్వని ఈయూ
ఈయూ దేశాలు ఇచ్చే వ్యాక్సిన్ ను అంగీకరించబోమన్న ఇండియా
క్వారంటైన్ విధిస్తామని హెచ్చరిక

భారత్ హెచ్చరికలతో కొన్ని యూరోపియన్ దేశాలు దిగొచ్చాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేసుకున్న భారతీయులను ఈయూ (యూరోపియన్ యూనియన్/ఐరోపా కూటమి) దేశాలు అనుమతించని సంగతి తెలిసిందే. ఆ రెండు వ్యాక్సిన్ల సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని ఆ దేశాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను ఆమోదించే జాబితాలో చేర్చకుంటే.. ‘మేం కూడా మీ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను ఆమోదంచబోం’ అని భారత్ హెచ్చరించింది.

ఆ వార్నింగ్ తో కొన్ని ఈయూ దేశాలు దిగొచ్చాయి. ఏడు దేశాలు కొవిషీల్డ్ కు ఆమోదం తెలిపాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్ లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చాయి. వాస్తవానికి ఈయూ కూటమి ఫైజర్ కొమిర్నాటి, మోడర్నా, ఆస్ట్రాజెనికా వ్యాక్స్ జెవ్రియా (భారత్ లో కొవిషీల్డ్.. కానీ, ఈయూ ఆమోదించలేదు), జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు వేసుకున్న వారికే ఈయూ దేశాలు అనుమతినిచ్చాయి.

భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులను యూరోపియన్‌ యూనియన్‌దేశాలు క్వారంటైన్ లో ఉండాల్సిందే అనే నిబంధనలు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. తమ దేశానికి వస్తున్నా ఈయూ దేశాల ప్రయాణికులను కూడా అదేవిధంగా క్వారంటైన్ విధిస్తామని హెచ్చరించింది. తమదేశంలో వేస్తున్నకొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వారిపై ఆంక్షలు విధించడాన్ని భారత్ తప్పుపట్టింది. ….

గ్రీన్‌ పాస్‌ పోర్ట్‌ స్కీమ్‌ కింద యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

భారతీయులను కూడా యూరప్‌ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరుతూనే, అందుకు అంగీకరించకుంటే, ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని, ఈయూ నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను సవరిస్తామని హెచ్చరించింది.

ప్రస్తుతం ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో దిగి వచ్చిన ఈ యూ దేశాలలో కొన్ని భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు పెట్టిన నిబంధనలను ఉపసంహరించుకున్నాయి. కొవిషీల్డ్ తీసికున్న ప్రయాణికులపై నిభందనలు సడలించాయి.

 

Related posts

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సభలు, రోడ్ షోలు మరో వారం పాటు నిషేధం!

Drukpadam

కేంద్రం అవలంబిస్తున్న వ్యాక్సినేషన్ విధానం లోపభూయిష్టం : అసదుద్దీన్ ఒవైసీ…

Drukpadam

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు …?

Drukpadam

Leave a Comment