Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు …?

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు …?

15 రోజులకు ఒకసారి వాడితే చాలు.
కావాల్సిన వారు సంప్రదించాలని ప్రకటన
ఓమిక్రాన్ కు పనిసేస్తుందంటున్న ఆనందయ్య

కరోనా కు మందు పంపిణి చేసి అందరికి సుపరిచితులైన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇప్పుడు ఓమిక్రాన్ కు కూడా మందు పంపిణి చేస్తానని ప్రకటించడంద్వారా వార్తల్లో నిలిచారు . ఆయన మందు ఎంతవరకు పనిచేస్తుంది అనేది శాస్త్రీయ నిరాదరణ కావాల్సిఉన్నా అది తీసుకోవడం ద్వారా ప్రమాదం ఏమిలేదని నిర్దారణ కావడంతో ఆయన అప్పట్లో దేశవ్యాపితంగా ,ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో మందు పంపిణి చేశారు .

ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆనందయ్య చెబుతున్నారు. ఒమిక్రాన్‌తో పాటూ ఇతర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందని తెలిపారు.
ప్రపంచదేశాలను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. ఈ మహమ్మారి ఎన్నో దేశాలకు వ్యాపించింది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటు భారత్‌లో కూడా మెల్లి, మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఒక కేసు నమోదుకాగా.. అతను కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో మాత్రం 20 కేసుల వరకు నమోదుకావడం కలవరపెడుతోంది. ఈ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న వేళ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆనందయ్య చెబుతున్నారు. ధన్వంతరి భారతీయులకు వరమని శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్‌తో పాటూ ఇతర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందని తెలిపారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలని.. ఒమిక్రాన్‌కి కృష్ణపట్నంలో, విశాఖలోను మందు పంపిణీ చేస్తానన్నారు. ఇతర వివరాలకు తమ సెల్ నంబర్ 9100036881ని సంప్రదించాలన్నారు .

ఒమిక్రాన్ లక్షణాలు వేరే.. ఇది సోకిన వారిలో ఊపిరాడకపోవడం ఎందుకు కనిపించడం లేదు?

  • గొంతులో ఇన్ఫెక్షన్
  • ఒళ్లు నొప్పులు, నీరసం
  • ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇవే
why breathing difficulty may not be linked with Omicron variant

కరోనా ఒమిక్రాన్ రకం ప్రమాదకరమైనదిగా ఇప్పటి వరకైతే నిర్ధారణ కాలేదు. పైగా గతంలోని ఆల్ఫా, డెల్టా వేరియంట్ల మాదిరిగా ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కూడా కనిపించడం లేదు. ప్రధానంగా ఊపిరి ఆడకపోవడమనే లక్షణం ఈ రకంలో అసలు కనిపించడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానికి ఎయిమ్స్ డాక్టర్ పునీత్ ముస్రా విశ్లేషణ ఇలా ఉంది.

ఇప్పటి వరకు మనం చూసిన కరోనా కేసుల్లో శ్వాస తీసుకోవడం కష్టతరంగా అనిపించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. చికిత్స తర్వాత కోలుకున్నవారిలో ఇది తగ్గుముఖం పట్టేది. కరోనా వైరస్ గత రూపాల్లో నేరుగా శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లేది. ఊపిరి తిత్తులు ఎగువ భాగంలో తిష్ట వేసుక్కూర్చుని అక్కటే కోట్లాది కణాలుగా ఏర్పడేది. కోట్ల కొద్దీ ఏర్పడిన వైరస్ కణాలు ఊపిరితిత్తుల గోడలకు ఉండే అతి సూక్ష్మమైన గాలితిత్తులను దెబ్బతీసేవి. దీంతో గోడల భాగం గట్టిపడిపోయేది. ఫలితంగా ఊపిరితిత్తులకు వచ్చే రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితమే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం.

కానీ, ఒమిక్రాన్ వేరియంట్ లో వైరస్ గొంతు భాగంలోనే ఉంటున్నట్టు ఎయిమ్స్ డాక్టర్ పునీత్ ముస్రా తెలిపారు. గొంతుభాగంలోనే వైరస్ పునరుత్పత్తి చేసుకుంటూ ఉండొచ్చని.. అందుకే శ్వాసపరమైన సమస్య తలెత్తడం లేదన్నారు. దీంతో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యూమోనియా) అవకాశాలూ తక్కువేనని చెప్పారు. ఒక వైరస్ రూపాంతరం చెందే కొద్దీ దాని లక్షణాలు కూడా మారడం అసాధారణమేమీ కాదన్నారు.

డెల్టాతో పోలిస్తే 7 రెట్లు అధికంగా ఒమిక్రాన్ రకం వ్యాప్తి చెందే లక్షణం ఉండడం ఒక్కటే అందరినీ ఆందోళనకు గురిచేస్తోందన్నది వాస్తవం. ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా గొంతు పచ్చిగా, మంటగా, నొప్పిగా అనిపించడం.. బలహీనత (నిస్సత్తువ), శారీరక నొప్పులు కనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో స్వల్పంగా జ్వరం కూడా కనిపిస్తోంది.

Related posts

ఇరాక్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 44 మంది మృత్యువాత…

Drukpadam

కరోనా మూడో వేవ్, హెల్త్ హబ్స్ పై సీఎం జగన్ సమీక్ష…

Drukpadam

ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Drukpadam

Leave a Comment